సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది.
మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్‌సైట్ పేరుతో ఇతర వెబ్‌సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు.
గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్‌సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు.
ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment