సోమవారం సాయంత్రం జిల్లా అంతా సంబరాల్లో మునిగిపోయింది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైందని తెలిసి అభిమానులు పండుగ చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం జిల్లా అంతా సంబరాల్లో మునిగిపోయింది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైందని తెలిసి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఊరూవాడా ఏకమై పార్టీలకతీతంగా యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు రంగులు చల్లుకుని కేరింతలు కొడుతూ సందడి చేశారు. టపాకాయల పేలుళ్లు, జై జగన్ నినాదాలతో పట్టణాలు, పల్లెలు దద్దరిల్లాయి. స్వీట్లు పంచుకున్నారు. జగనన్న జనంలోకి రావాలని దేవుళ్లను ప్రార్థించిన వారు మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు కావడం ఆయన అభిమానుల్లో, పార్టీ నాయకుల్లో ఆనందాన్ని నింపింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో తీర్పు ఉందన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు సాయంత్రం తీపి కబురు అందింది. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
తుడా సర్కిల్‌లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం కూడలిలో రాఘవరాజు, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు టపాకాయలు కాల్చారు. దొడ్డాపురం వీధిలో సప్తగిరి మెడికల్స్ వద్ద బోయళ్ల రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సంబరాల్లో మునిగితేలారు. డీఆర్ మహల్ సర్కిల్‌లో కొండారెడ్డి రాయలసీమ విద్యాసంస్థల అధిపతి వై.ఆనందరెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు.
ఆర్‌సీ రోడ్డులో స్నేహ డెకార్స్ షోరూం వద్ద ఎంఎస్.రాజు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాలెం, శెట్టిపల్లి, రాజీవ్‌నగర్‌లో అబిమానులు, నాయకులు టపాకాయలు కాల్చారు. బొమ్మగుంటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి హర్షం ప్రకటించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, షమీమ్ అస్లాం, ఉదయకుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పుంగనూరులో నెడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.
5 వేల మందితో ర్యాలీ నిర్వహించారు. టపాకాయలు కాల్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు అమరనాథరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరులో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీ దేవి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, గుడిలో 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలో బియ్యపు కృష్ణారెడ్డి మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. బి కొత్తకోటలో టపాకాయలు కాల్చి హర్షం ప్రకటించారు.
శంకరాపురంలో బీరంగి సర్పంచ్ అమరనాథరెడ్ది ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. పుత్తూరులో పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. టపాకాయలు కాల్చి, రంగులు చల్లుకున్నారు. సత్యవేడు సంబరాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, నాయకులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సురేంద్రరాజు పాల్గొన్నారు. నగరిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. చంద్రగిరిలో పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు.