సాక్షి, తిరుపతి: నగరంలోని మురికివాడల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని అభివృద్ధి చేసి సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ లో ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..టిటిడీలో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని, అలాగే టిటిడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. తిరుపతిలో సంపూర్ణ మధ్యనిషేధానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో దశల వారీగా మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీని గుర్తు చేశారు. స్థానికుల సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తానని, ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment