Thirupathi temple
-
Tirumala Srivari Brahmotsavam 2023: స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామి (ఫొటోలు)
-
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
-
శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై
సాక్షి, తిరుమల : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ వీఐపీ సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్.. ఆ తర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయం వెలుపలకు చేరుకున్న గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తాను శ్రీవారి భక్తురాలినని.. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వాహణ బాగుందని కితాబిచ్చారు. -
తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతా..
సాక్షి, తిరుపతి: నగరంలోని మురికివాడల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని అభివృద్ధి చేసి సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ లో ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..టిటిడీలో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని, అలాగే టిటిడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. తిరుపతిలో సంపూర్ణ మధ్యనిషేధానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో దశల వారీగా మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీని గుర్తు చేశారు. స్థానికుల సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తానని, ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. -
టీటీడీలో ప్రొటోకాల్ వివాదం
సాక్షి, చిత్తూరు: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి అవమానం జరిగిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడగా.. ఆయనకు తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో ఓవీ రమణ తనను అవమానించారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఓవీ రమణ.. మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. అయితే, దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి జరిగిన అవమానంపై ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లేఖ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారంలోపు టీటీడీ స్పందించకుంటే జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఓవీ రమణ ఆరోపించారు. -
మాజీ ప్రధాని అంటే లెక్కలేదా?
సాక్షి, తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్తిగా లెక్కలేనితనంతో వ్యవహరించిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. దేవెగౌడ విషయంలో టీటీడీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి తిరుమలకు వచ్చిన సందర్భంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ చనువు కారణంగా అతిపెత్తనం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి, కర్ణాటక సీఎంకు జరగాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు జరగలేదన్నారు. పారిశ్రామికవేత్తలు, తమకు కావాల్సిన వారైతే తిరుమల జేఈవో స్వాగతం పలుకుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై జేఈవోతో మాట్లాడాలని మాజీ ప్రధాని ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి అతిథులుగా వచ్చినవారిని అవమానించడం తగదన్నారు. స్థానిక పోలీసు ఎస్కార్ట్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తప్పుపట్టారు. 86 ఏళ్ల మాజీ ప్రధానిని శ్రీవారి హుండీ దగ్గరే వదలి వెళ్లడం భద్రత లోపానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధానిగా దేవెగౌడ తిరుమలకు వచ్చిన ప్రతిసారి అధికారులు స్వాగతం పలకకుండా నిర్లక్ష్యం చేయడం పద్ధతి కాదన్నారు. -
నల్ల బ్యాడ్జీలతో రావొద్దు: టీటీడీ జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ కోటా విధింపు విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం, ఆదివారల్లో 30 వేల టోకన్లు, సోమ, శుక్రవాల్లో 20 వేలు, మంగళ, బుధ, గురువారల్లో 17 వేల టోకన్లు కేటాయింపు జరిగిందని జేఈఓ తెలిపారు. ఈ నిబంధనలు రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, భక్తులు టైంస్లాట్ కౌంటర్లు సౌకర్యాలు సులభంగా పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆలయం లోపల నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించారు. స్వామి వారి అభరణాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపరాదంటూ జేఈఓ శ్రీనివాస రాజు ఆదేశాలు జారీ చేశారు. -
సౌమ్యనాథా... దత్తతేదీ!
రాజంపేట: వైఎస్ఆర్ జిల్లాలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం దత్తత తీసుకోవడం కలగానే మిగులుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద చారిత్రాత్మక దేవాలయంగా తెరపైకి వచ్చింది. అయితే కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడంతో ఆలయ నిర్వహణ విషయంలో దేవదాయధర్మాదాయశాఖ కానీ, తిరుమల తిరుపతి దేవస్ధానం కాని పట్టించుకోవడంలేదు. ఇంతవరకు ట్రస్ట్‌బోర్డుకు నోచుకోలేదు. కేవలం సింగల్ట్రస్ట్తో నడుస్తోంది. ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును చూసిన భక్తులు అచ్చం ఏడుకొండలస్వామినే దర్శించుకున్నంత భాగ్యం కలుగుతోందని అనుభూతి చెందుతున్నారంటే ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతుంది. సౌమ్యనాథాలయ చరిత్రలోకి.. సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్ప కళాసంపత్తికి ఆలవాలమై చెయ్యేరు(బహుదా) నదీతీరాన నందలూరు గ్రామంలో నిర్మితమై ఉంది. జిల్లా కేంద్రం కడపకు 45కిలోమీటర్ల దూరంలో, రాజంపేటకు 10కిలోమీటర్ల దూరంలో ఉంది. 10ఎకరాల విస్తీర్ణంలో..108 స్తంభాలతో నిర్మించిన సువిశాలమైన ఆలయం. కులోత్తుంగచోళుడు (చోళరాజు)11శతాబ్ధం పూర్వార్ధంలో ఆలయాన్ని నిర్మించారు. అన్నమయ్య స్వామిని దర్శించుకొని కీర్తనలు ఆలపించారని చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం వెనుక వెయ్యేళ్ల చరిత్ర ఉంది. స్వామి వారి గర్భగుడిలో ఏ దీపంలేకపోయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దివ్యమంగళరూపం దేదీప్యమానంగా కనపడే విధంగా ఆలయం నిర్మించడం విశేషం. స్వామివారి పాదాలపై స్యూరకిరణాలు పడతాయి. నారదమునీంద్రునిచే ప్రతిష్ట.. శ్రీసౌమ్యనాథస్వామి ఆలయంలో మూలవిరాట్టును దేవర్షియగు నారదమునీంద్రులు ప్రతిష్టించారు. మూలవిరాట్టు ఆరు అడుగులు ఎత్తుతో సౌమ్యంగా అభియముద్రాలంకితమై దర్శనిమిస్తారు. సౌమ్యనాధున్ని చోళరాజులు చొక్కనాధుడు అని పిలుచుకునేవారు. సౌమ్యనాథుడనగా సౌమ్య(లక్ష్మీదేవి)కు నాథుడని, ప్రశాంతస్వరూపుడని అర్ధాలున్నాయి. తెల్లవారుజామున ఆలయంలో సప్తబుషులు స్వామికి పూజచేస్తారని పూర్వం ఆలయ అర్చకులు చూసిన దాఖలాలు ఉన్నాయని ప్రచారం. ఐదేళ్ల కిందట నుంచి ఆలయం దినాదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. స్వామికి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. దత్తతకు సిద్ధమై ఆపై.... టీటీడీ పాలకమండలి దేవుని కడపతోపాటు నందలూరు సౌమ్యనాథాలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధమైనా రూ.30లక్షల వ్యయంతో రథం మాత్రం చేయించి సరిపెట్టింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం టీటీడీ దత్తతు తీసుకునేందుకు సమ్మితించారు. ఆయన మరణం తర్వాత ఈ విషయం ఎవరూ పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంతమండలంలో ఉన్న ఘనచరిత్ర కలిగిన సౌమ్యనాథాలయం టీటీడీలోకి విలీనం చేయడంపై ఆయన దృష్టిపెట్టాలని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథునరెడ్డి కూడా ఈ ఆలయానికి కేంద్రపురావస్తుశాఖ నుంచి విముక్తి కల్పించి, టీటీడీలోకి విలీనం చేసేలా కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు.