వైఎస్. జగన్మోహనరెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను విరమించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్జప్తి చేశారు.
చిత్తూరు:రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను విరమించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్జప్తి చేశారు. శుక్రవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దీక్షపై రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలు ఎలాంటి కుట్రలు చేయడానికైనా వెనకాడరని భూమన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఆరోగ్యం ఆందోళన కల్గిస్తున్నందున విరమించాలని ఆయన కోరారు. సమన్యాయం కోసం వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షను భగ్నం చేయడంతో .. జగన్ జైల్లో దీక్షకు దిగడం తెలిసిందే. .