గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగావిద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. ఈనెల 12 నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధి లో మొత్తం 11,500మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం వరకూ జిల్లా లో 10,181 మంది విద్యార్థులు హాజరు కాగా, శనివారం 612మంది హాజరయ్యా రు. మొత్తం తొమ్మిది రోజులు కలిపి 10,793 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.
1,27,501 ర్యాంకు నుంచి ఆపై చివరి ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆప్ష న్లు నమోదు చేసుకునేందుకు తుది గడు వు ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు వాటిని మార్చుకుని తాజాగా ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈనెల 22,23 తేదీ ల్లో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. జిల్లాలోని 46 ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 26న సీటు అలాట్‌మెంట్ తరువాత జిల్లాలోని కళాశాలల్లో బ్రాంచ్‌ల వారీగా భర్తీ అయిన సీట్ల వివరాలపై స్పష్టత రానుంది.
ముగిసిన ఎంసెట్ కౌన్సెలింగ్
Published Sun, Jun 21 2015 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement