
ఎంసెట్ కౌన్సెలింగ్ సందడి ఆరంభం
- సజావుగా దరఖాస్తుల పరిశీలన
- తొలిరోజు 105 మంది ఎంసెట్ అభ్యర్థులు
విశాఖపట్నం: చాలా రోజులుగా ఎదురు చూ స్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకా రం చుట్టడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రారంభ ప్రక్రియ ధ్రువపత్రాల పరిశీ లన మొదలు కావడంతో ఉపశమనం పొం దారు. గురువారం కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగు కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్ర మాన వ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కెమికల్ కళాశాల వ ద్ద ప్రారంభించారు.
గురువారం 1వ ర్యాంకు నుంచి 5000ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఉద యం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలుసు న్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. వీరు వేచిఉండడానికి ప్రత్యేకం గా ఏర్పాట్లు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన, న మోదు ప్రక్రియ సవ్యంగా సా గింది. వెయ్యిలోపు ర్యాంకర్ల లో అల్లూరి తనూజ(640), అశ్విన్ కుమార్ జైన్ (759) లు మాత్రమే హాజరయ్యారు.
105 మంది హాజరు: తొలిరోజు 105 మంది మాత్రమే హాజరయ్యారు. 2500 లోపు ర్యాం కర్లు 30మంది, 2501నుంచి 5000లలోపు ర్యాంకర్లు 70మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. క్యాంపు ఆఫీసర్లుగా ఆర్‌జేడీ కె.సంధ్యారాణి, కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు వ్యవహరించారు.
నేడు 5001 నుంచి 10000 వరకూ..
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం 5001ర్యాంకు నుంచి 10000 వరకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. 5001నుంచి 7500వరకు పాలిటెక్నిక్ కళాశాల, 7501నుంచి 10000 వరకు కెమికల్ ఇంజినీరింగు కళాశాలకు హాజరు కావాలి. ఎస్టీ కేటగిరి విద్యార్థులు అందరూ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరు కావాలి. గురువారం హాజ రుకానివారు కూడా శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవచ్చు.