హైదరాబాద్:ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది. ఈనెల 19న నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ ౩ వరకూ ఆప్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 4న ఆప్షన్ల మార్పుకు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. సెప్టెంబర్ 5న సీట్ల కేటాయింపును నిర్వహిస్తుండగా, 11 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొంది.
గతంలో హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు తెలిపింది.