అను‘మతి’ లేని ప్రచారం
నిజామాబాద్ అర్బన్ : ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం జిల్లా వి ద్యార్థులకు చిక్కులు వచ్చి పడ్డాయి. జిల్లాలో ఉన్న మొ త్తం పది ఇంజినీరింగ్ కళాశాలలకుగాను, జేఎన్‌టీయూ కేవలం మూడు కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా ఏడింటిని పక్కన పెట్టింది. అయినా, ఆ ఏడు కళాశాలలు విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా విద్యార్థులను అసత్య ప్రచారాలతో మోసం చేస్తున్నాయి.
ప్రవేశాల వేళ
ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసంవిద్యార్థులు ఆరాట పడుతున్నారు. కళాశాల ఎంపికలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తల మునకలయ్యారు. బంగారు భవిష్యత్తు కోసం మంచి కళాశాల, దగ్గరి ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి సరైన విధి విధానాలు తెలియక అవస్థలు పడుతున్నారు. కళాశాలకు అఫిలియేషన్ రద్దయినా, కౌన్సెలింగ్ జాబితాలో కళాశాలల పేరు లేకున్నా, కొన్ని కళాశాలలు కౌన్సెలింగ్ సెం టర్ల వద్ద జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో పది ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం మూడు కళాశాలలకు మాత్రమే జేఎన్‌టీయూ ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చిం ది. మిగతా ఏడు కళాశాలలకు అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో అనుమతి పొందిన మూడు కళాశాలలలో మహిళా కళాశాల విభాగంలో కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (కిట్స్) మాత్రమే ఉంది.జిల్లాలో మొత్తం 3,060 సీట్లకుగాను ఏడు కళాశాలలకు అనుమతి లేకపోవడంతో 1,060 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్థా నికంగా చదివే విద్యార్థులు కళాశాలలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరగా చేసుకుని, అనుమతి లేకున్నా కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.
కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద సందడి
ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ప్రైవేట్ కళాశాలల ప్రచార సందడి నెలకొంది. జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. పాలి టెక్నిక్ కళాశాల వద్ద సీట్ల భర్తీకి అనుమతి లేని మూడు కళాశాలల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ కళాశాలలో గల బ్రాంచ్‌లు, కళాశాలల కోడ్‌లతో సహా జోరుగా ప్రచారం చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు కళాశాల ఎంపికలో అయోమయానికి లోనవుతున్నారు.