జేఎన్‌టీయూలో ఎంసెట్ కౌన్సెలింగ్ నేడు
Published Wed, Aug 21 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజూ మంగళవారం కూడా జరగలేదు. సమ్మె ప్రభావంతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపి వేసినట్టు పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ టీఆర్‌ఎస్ లక్ష్మి మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు తమకు ఉత్తర్వులు అందాయని తెలిపారు. దీంతో కౌన్సెలింగ్‌కు సంబంధించి సామగ్రిని జేఎన్‌టీయూకు తరలిస్తున్నట్టు చెప్పారు.
ఉద్యోగుల సమ్మె వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నిలిచిపోవడంతో రెండో రోజు మంగళవారం కూడా అభ్యర్థులు అరకొరగానే హాజరై కౌన్సెలింగ్ జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా నిపుణులైన వారిచే ధ్రువీకరణ పత్రాలు పరిశీలన జరగాల్సి ఉంది. ఇందుకు సుమారు 10 మంది అధ్యాపకులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉండాలి. అరుుతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలిటెక్నికల్ అధ్యాపకులు, సిబ్బంది విధులు బహిష్కరించడంతో కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడింది. మంగళవారం నాటి కౌన్సెలింగ్‌కు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు హాజరై ఇంటిముఖం పట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టు టౌన్ ఎస్‌ఐ వై.కృష్ణకిశోర్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. కనీసం మూడో రోజైనా కౌన్సెలింగ్ జరుగుతుందా? అన్న అనుమానాలు నెలకొన్నారుు.
అభ్యర్థుల పడిగాపులు...
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు కూడా బ్రేక్ పడడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యూరు. వచ్చిన కొద్దిపాటి మంది అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచే కళాశాలలో పడిగాపులు కాశారు. పది గంటల ప్రాంతంలో సిబ్బంది వచ్చి కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించడంతో ఏం చేయూలో తోచక అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోతే ఎలాగని సిబ్బందిని నిలదీశారు. ఈ నెల 30 వరకు అవకాశం ఉందని, సమ్మె కారణంగానే జరగలేదని దీనిని గ్రహించాలని సిబ్బంది కోరారు. దీంతో చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.
Advertisement
Advertisement