ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా | Telangana top in the AP Eamcet | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా

Published Sat, May 6 2017 1:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా - Sakshi

ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా

- ఇంజనీరింగ్‌ విభాగంలో హైదరాబాదీకి ఫస్ట్‌ ర్యాంకు
- టాప్‌–10లో ఐదుగురు తెలంగాణవారే


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్‌–2017 ఫలితాల్లో తెలంగాణ విద్యా ర్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్‌ విభాగం లో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్‌–10లో ఐదు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. ఇక అగ్రికల్చరల్‌ /ఫార్మా స్ట్రీమ్‌లోనూ టాప్‌–10లో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులు నిలిచారు. మొత్తంగా ఏపీ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌–10 ర్యాంకులతోపాటు అగ్రికల్చరల్‌/ఫార్మా విభాగంలో టాప్‌–10లో ఐదు ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. ఏపీ ఎంసెట్‌ ఫలితాలను శుక్రవారం విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎంసెట్‌ చైర్మన్‌ కుమార్‌ తదితరులు విడుదల చేశారు.

హైదరాబాదీల సత్తా..
ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో తెలంగాణ నుంచి 17,356 మంది పరీక్ష రాయగా.. 15,216 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి కల్చరల్‌/ఫార్మాలో 9,814 మంది పరీక్ష రాయగా.. 9,419 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి వి.మోహన్‌ అభ్యాస్‌ 153.935 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. ఖమ్మం జిల్లా కొత్తగూ డేనికి చెందిన అవ్వారి సాయి ఎస్‌ఎస్‌వీ భరద్వాజ్, ఐదో ర్యాంకును హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన వి.వెంకట షణ్ముఖ సాయి, ఆరో ర్యాంకును హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన కోటగిరి వెంకట నిఖిల్, 9వ ర్యాంకును మాదాపూర్‌ కావూరిహిల్స్‌కు చెందిన డి.వరుణ్‌తేజ దక్కించుకున్నారు. ఇక అగ్రికల్చరల్‌/ఫార్మా విభాగంలో కూకట్‌పల్లికి చెందిన సాదినేని నిఖిల్‌చౌదరి 4వ ర్యాంకు, కరీంనగర్‌కు చెందిన కల్యాణ్‌ 8వ ర్యాంకు, మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన పట్లోళ్ల అఖిల 10వ ర్యాంకు దక్కించుకున్నారు.

ఆన్‌లైన్‌లో పరీక్ష..: ఏప్రిల్‌ 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్, 28న అగ్రికల్చర్‌/ఫార్మా విభాగం ఎంసెట్‌ పరీక్షలు జరిగాయి. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,49,505 (79.74 శాతం) మంది, అగ్రికల్చర్‌/ఫార్మా విభాగంలో 68,882 (91.24 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. పలువురు అభ్యర్థులు చేసిన పొరపాట్లు, ఇంటర్‌ మార్కుల వివరాలు అందని కారణంగా ఇంజనీరింగ్‌లో 1,39,190 మందికి, అగ్రికల్చర్‌/ఫార్మాలో 64,379 మందికి మాత్రమే ర్యాంకులు ప్రకటించారు. ఇక ఇంజనీరింగ్‌ విభాగంలో 1,87,484 మంది పరీక్ష రాయగా.. 1,49,505 మంది అర్హత సాధించారు. వారిలో బాలురు 81,734 మంది, బాలికలు 57,451 మంది ఉన్నారు. ఇక అగ్రికల్చర్‌/ఫార్మా స్ట్రీమ్‌లో 75,489 మంది పరీక్ష రాయగా.. 68,882 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 21,885 మంది బాలురు, 42,489 మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్‌/ఫార్మా విభాగంలో గుంటూరులోని కొత్తపేటకు చెందిన వూటుకూరి వెంకట అనిరుధ్‌ 150.567 మార్కులతో తొలి ర్యాంకు సాధించాడు.

మే 12 నుంచి ర్యాంకు కార్డులు
అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.  ఠీఠీఠీ. టఛిజ్ఛి. www. sche. ap. gov. in/ eamcet వెబ్‌సైట్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్‌ ప్రారంభించి జూన్‌ 19 నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 3,924 సీట్లు, 305 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement