ఏపీ ఎంసెట్ రెండో దశ ఫలితాలు విడుదల
Published Sun, Jun 4 2017 2:06 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM
కాకినాడ: ఏపీ ఎంసెట్–17 రెండో దశ ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేసినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో రీ వాల్యుయేషన్‌లో మార్కులు పొందిన అభ్యర్థులు 1,627, సీబీఎస్‌ఈ 1,413, దూరవిద్యా కేంద్ర విద్యార్థులు 86, ఇతర బోర్డులు 456 మందితోపాటు అగ్రికల్చర్ విభాగంలో 1,021, ఇతరులుకు కలిపి మొత్తం మీద 4,861 అభ్యర్థులకు ర్యాంకులు విడుదల చేశామన్నారు. ఇంకా ర్యాంకులు ఎవరికైనా రాకపోయినా, ర్యాంకులపై సందేహాలున్నా 0884–2340535 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
Advertisement
Advertisement