2 నుంచి ఏపీ ఎంసెట్ హాల్‌ టికెట్లు జారీ | ap eamcet hall tickets to be issued from may 8th | Sakshi
Sakshi News home page

2 నుంచి ఏపీ ఎంసెట్ హాల్‌ టికెట్లు జారీ

Published Fri, May 1 2015 10:17 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

ap eamcet hall tickets to be issued from may 8th

కాకినాడ(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న ఏపీ ఎంసెట్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎంసెట్-2015 చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 6 వరకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. గంట ముందు హాలులోకి అనుమతిస్తామన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement