జేఎన్‌టీయూకేకు ఏపీ ఎంసెట్
Published Fri, Jan 6 2017 11:08 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
ఏపీ ఎంసెట్–17బా««దl్యతలను ఉన్నత విద్యాశాఖ ఎట్టకేలకు జేఎ¯ŒSటీయూకేకు అప్పగించింది.గతంలో ఎంసెట్‌తో పాటు పీజీ ఈసె ట్ బాధ్యతను నిర్వహించిన జేఎ¯ŒSటీయూ కే నిర్వహించి న సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పీజీ ఈసెట్ బాధ్యతలను ఆంధ్రా యూని వర్సిటీకి అప్పగించింది. జేఎ¯ŒSటీయూకే ఇ¯ŒSఛార్జి రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఈఈఈ విభాగం ఆచార్యుడు డాక్టర్ సీహెచ్ సాయిబాబును ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సాయిబాబు 2015, 16 సంవత్సరంలో ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా అతి తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈయన ఏపీ జె¯ŒSకో, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టులకు కన్వీనర్‌గా, మూడు సార్లు ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఎంసెట్ కన్వీనర్‌గా నియమితులైన సాయిబాబు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జేఎ¯ŒSటీయూకే వీసీ వీఎస్‌ఎస్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా వర్సిటీ సిబ్బంది సహకారంతో ఎంసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించి సకాలంగా ఫలితాలు విడుదల చేయడంతో పాటు కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియకు చర్యలు తీసుకుంటానని ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement
Advertisement