నేటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు
ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు
కాకినాడ: ఇంజనీరింగ్ కళాశాలల్లో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్ల మార్పు, చేర్పులు ఈనెల 19, 20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందన్నారు.
ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంట ర్‌లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్‌వర్డ్ చాలా కీలకమని, ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరు కాలేకపోయినా తరువాత రోజు హాజరు కావచ్చని వివరించారు.