Sai Babu
-
నిర్బంధాన్ని ధిక్కరిద్దాం
తెలుగు విప్లవ రచయితలు ఇద్దరు మహారాష్ట్ర జైళ్లలో బందీలయ్యారు. వీరిలో ప్రొ‘‘ సాయిబాబా నాగపూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకు వైద్యంకోసం వేసిన బెయిల్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోనే పేరెన్నికగన్న విప్లవకవి వరవరరావు ఐదు నెలల నుంచి పూణేలోని ఎరవాడ జైల్లో బందీ అయ్యారు. 80 ఏళ్ల వయసులో కనీస సౌకర్యాలు లేని జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీరేగాక దేశవ్యాప్తంగా సుప్రసిద్ధులైన సుధాభరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, ప్రొ. షోమాసేన్, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరా, రోనావిల్సన్, సుధీర్ ధావ్లే, మహేష్ రౌత్ కూడా ఎరవాడ జైల్లో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. సాహిత్య, కళా, న్యాయ, మేధో రంగాల్లో దేశం గర్వించదగిన ఈ బుద్ధిజీవులను అక్రమ కేసుల కింద సంఘ్‌పరి వార్ ప్రభుత్వం నిర్బంధించింది. వీళ్లంతా తమ మేధస్సుతో, సృజనాత్మకతతో సమాజ వికాసానికి దోహదం చేశారు. ప్రజాస్వామిక విలువలను, సంస్కృతిని స్థాపించడానికి కృషి చేశారు. ప్రజా పోరాటాలతో కలిసి నడవడమే బుద్ధిజీవుల కర్తవ్యమనే తరతరాల ఆదర్శాన్ని ఎత్తిపట్టారు. అట్టడుగు కులాల, వర్గాల, ఆదివాసుల, మత మైనారిటీల ఉనికినే రద్దు చేసే ప్రభుత్వ విధానాలను వీళ్లు ఎదిరించారు. దేశ సంపదను సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే కుట్రలను బహిర్గతం చేశారు. తమ శ్రమతో సమస్త సంపదలు సృష్టిస్తున్న కార్మికవర్గంపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు. పీడిత ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగమయ్యారు. అంతిమంగా ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న నియంతృత్వాన్ని ఖండించి, ఒక మానవీయమైన వ్యవస్థను స్థాపించుకోడానికి ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలబడ్డారు. ప్రజల తరపున రాస్తూ, మాట్లాడుతూ, పోరాడుతున్నందుకే వీరి మీద తప్పుడు ఆరోపణలు చేశాయి. బెయిలు రాకుండా అడ్డుకుంటున్నాయి. న్యాయ ప్రక్రియను తమ కనుసన్నల్లో నడుపుతున్నాయి. మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వచ్చేసిందనడానికి వీళ్ల నిర్బంధమే ఒక ఉదాహరణ. ఈ పది మంది మేధావులేకాదు, దేశ వ్యాప్తంగా వేలాది మంది దళితులు, ఆదివాసులు, ముస్లింలు చేయని నేరానికి ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. మనకు పేర్లు తెలిసిన ఈ పది మంది గురించేగాక జైళ్లలో అక్రమంగా బందీలైన వాళ్లందరి విడుదల కోసం ఆందోళన జరుగుతోంది. దేశంలో హక్కుల ఉల్లంఘన ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఆందోళనపడుతున్నారు. ప్రజాస్వామ్యమంటే భిన్నాభిప్రాయ ప్రకటనలకు చోటు ఉండటం. వేర్వేరు ప్రత్యామ్నాయాలను విశ్వసించి, ఆచరించే అవకాశం ఉండటం. పాలకులు ఈ విలువను ధ్వంసం చేశారు. ఈ స్థితిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా పోరాటాలు జరిగాయి. తెలుగు సాహిత్య, మేధో రంగాల నుంచి కూడా తీవ్ర నిరసన వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదు, వరం గల్, విజయవాడ, కర్నూలు నగరాల్లో విరసం ఆధ్వర్యంలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులతో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం. విప్లవ రచయితల సంఘం -
19 నుంచి ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్ల జారీ
కన్వీనర్ సీహెచ్ సాయిబాబు వెల్లడి సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–2017 హాల్‌టికెట్ల జారీ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని సెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్ ఈసారి పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తు న్నామని, ఇంజనీరింగ్ పరీక్షను ఏప్రిల్ 24, 25, 26వ తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 28న ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉర్దూ మాధ్యమం పరీక్ష రాయాలనుకొనేవారు కర్నూలులో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఏపీ ఎంసెట్‌కు రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 10, రూ.5 వేల అపరాధ రుసుముతో ఈ నెల 17, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవచ్చునని చెప్పారు. ఏపీలో పలు నగరాలతో పాటు హైదరాబాద్‌లోని నాచారం, మౌలాలి, హయత్‌నగర్‌లలో 140 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వివరాలకు 0884–2340535, 0884–2356255 నంబర్లలో onlineapeamcet2017@ gmail. com ద్వారా సంప్రదించవచ్చు. -
జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సాయిబాబు
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసాద్‌రాజును ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమించారు. జేఎన్టీయూకే కళాశాల ఈఈఈ విభాగ ఆచార్యులుగా ఉన్న సాయిబాబు ఏపీ జెన్కో, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టుల భర్తీకు కన్వీనర్‌గా, మూడు సార్లు ఈసెట్ పరీక్షల కన్వీనర్‌గా, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన వీవీ వీఎస్ఎస్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో జేఎన్టీయూకే అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సాయిబాబును వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు
ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు కాకినాడ: ఇంజనీరింగ్ కళాశాలల్లో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్ల మార్పు, చేర్పులు ఈనెల 19, 20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందన్నారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంట ర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్వర్డ్ చాలా కీలకమని, ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరు కాలేకపోయినా తరువాత రోజు హాజరు కావచ్చని వివరించారు. -
ఏపీ ఎంసెట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నిమిషం లేటైనా నో ఎంట్రీ: కన్వీనర్ సాయిబాబు సాక్షి,హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్.సీహెచ్.సాయిబాబు తెలిపారు. గతంలో మాదిరిగానే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజనీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి అన్ని రకాల ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్లతో పాటు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా అనుమతించబోమని తెలిపారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 2356255, 0884-23405459 (ఫ్యాక్స్), 18004256755(టోల్‌ఫ్రీ) నంబర్లను గానీ apeamcet2k16@gmail.com ద్వారా గానీ సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు. -
3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
-అపరాధ రుసుము లేకుండా తుది గడువు మార్చి 21 -మార్చి 3 నుంచి పీజీసెట్ దరఖాస్తులు -దరఖాస్తు రుసుము రూ.100 పెంపు హైదరాబాద్ ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఏపీ ఎంసెట్-2016), ఏపీ పీజీసెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి మూడో తేదీనుంచి ప్రారంభం కానుంది. పీజీసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి ఆరో తేదీనుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈనెల 29న, పీజీసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీసెట్ కమిటీల మొదటి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. సమావేశానంతరం ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఫిబ్రవరి 3 నుంచి మార్చి 21 వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నామని వివిరించారు. ఆన్లైన్ దరఖాస్తుల సమయాన్ని 48 రోజుల పాటు కేటాయిస్తున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు స్పష్టంచేశారు. దరఖాస్తు, ఇతర నియమనిబంధనలకు సంబంధించిన అంశాలను www.apeamcet.org ’’లో పొందుపరుస్తున్నామన్నారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్లైన్లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని అభ్యర్ధులు గమనించి వివరాలను సరిచూసుకొని అప్లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తు ఫీజును ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రాబ్యాంకు, క్రెడిట్, డెబిట్ మాస్ట్రో కార్డుల ద్వారా చెల్లించవచ్చని వివరించారు. పరీక్ష నమూనా గత ఏడాది మాదిరిగానే ఉంటుందన్నారు. అపరాధ రుసుము రూ.500 తో ఏప్రిల్ 2వరకు, రూ.1000తో ఏప్రిల్ 11వరకు, 5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్19 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 27వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుగా నిర్ణయించినట్లు వివరించారు. ఏప్రిల్27నుంచి హాల్టిక్కెట్ల జారీచేయనున్నారు. ఈఏడాది.. ఎంసెట్ కు 2.70 లక్షల మంది దరఖాస్తు చే యవచ్చని అంచనావేస్తున్నామని తెలిపారు. ఇలా ఉండగా ఏపీ పీజీసెట్‌కు సంబంధించి మార్చి 4న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 20వరకు అపరాధరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుములతో చివరి గడువు మే 21గా నిర్ణయించారు. ఇలా ఉండగా ఈసారి పీజీసెట్ పరీక్షను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. గేట్ తరహా పరీక్షలు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో కూడా వాటి పరీక్ష కేంద్రాలున్నందున వాటిని వినియోగించుకొని పీజీసెట్ పరీక్షలు నిర్వహించవచ్చని సమావేశంలో సూచనలు వచ్చాయి. అయితే.. దీనిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడానికి కాకినాడ జెఎన్టీయూ వీసీ కుమార్ నేతృత్వంలో మండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మంచి ప్రయత్నం : చిరంజీవి
‘‘ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ‘కంచె’ చూడ్డానికి వెళ్లాను. చూశాక ఇంటికి పిలిపించి చిత్రబృందాన్ని అభినందించాలనిపించింది. సినిమా ఆద్యంతం హృద్యంగా సాగింది. ఇది ఒక విజయవంతమైన ప్రయత్నం’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ‘కంచె’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ- ‘‘పల్లె వాతావరణాన్ని ఎంత కళ్లకు కట్టినట్లు చూపించారో, రెండో ప్రపంచ యుద్ధం నాటి వార్ సీక్వెన్సెస్‌ను కూడా అంతే గొప్పగా ఆవిష్కరించారు. జార్జియాలో తీసిన వార్ సీన్స్ చూసి వంద రోజుల పాటు తీసుంటారేమో అనుకున్నా. కేవలం 55 రోజుల్లో మొత్తం సినిమా తీశారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఈ సినిమా ఉంది. వరుణ్ ఈ సినిమాలో 1940ల్లో నాటి హీరోలాగానే కనిపించాడు. సైనికుడిగా, పల్లె యువకునిగా ఒదిగిపోయాడు. సాయిమాధవ్ రాసిన సంభాషణలు చాలా అందంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అందరూ దీన్ని ఓ క్లాసిక్ అనుకుంటున్నారు కానీ ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా. ఇదో మంచి ప్రయత్నం’’ అన్నారు. క్రిష్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవి లాంటి అగ్ర నటుడు నా సినిమాలోని ప్రతి డైలాగ్‌ను గుర్తుపెట్టుకుని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఆయనకు విషెస్ చెప్పి, చిరంజీవిగారిని కలవడానికి వెళుతున్నానని చెప్పగానే ఒకే మాట అన్నారు. నువ్వు ‘గమ్యం’ తీసినప్పుడు నాకు ఇంత ఆనందం కలగలేదు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అని నన్ను హగ్ చేసుకున్నారు. అమ్మకి, నాన్నకి, పుడమికి, పుస్తకానికి నమస్కరిస్తూ అంటూ సినిమా స్టార్ట్ చేశాను. ఈసారి నుంచి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సెల్యూట్ చేస్తూ నా మిగతా సినిమాలు తీస్తాను’’ అని చెప్పారు.