ఏపీ ఎంసెట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు | Effective arrangements to the AP EAMCET examination | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Published Thu, Apr 21 2016 2:45 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

Effective arrangements to the AP EAMCET examination

నిమిషం లేటైనా నో ఎంట్రీ: కన్వీనర్ సాయిబాబు

 సాక్షి,హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్.సీహెచ్.సాయిబాబు తెలిపారు. గతంలో మాదిరిగానే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజనీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి అన్ని రకాల ఫోన్‌లు, వాచీలు, కాలిక్యులేటర్లతో పాటు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా అనుమతించబోమని తెలిపారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 2356255, 0884-23405459 (ఫ్యాక్స్), 18004256755(టోల్‌ఫ్రీ) నంబర్లను గానీ apeamcet2k16@gmail.com ద్వారా గానీ సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement