ఏపీలో జూన్ 6నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ | ap engineering counselling starts from june 6th, ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

ఏపీలో జూన్ 6నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Published Thu, May 26 2016 10:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ap engineering counselling starts from june 6th, ganta srinivasa rao

విజయవాడ: జూన్ 6వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఆరో తేదీ నుంచి 15 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన, 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్ల ఎంపిక, 22 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను మంత్రి గంటా ఈ రోజు ఉదయం ఇక్కడ విడుదల చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement