నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు | Engineering Rank cards from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు

Published Thu, May 19 2016 2:43 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు - Sakshi

నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు

వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అవకాశం

 సాక్షి, హైదరాబాద్/కాకినాడ: ఏపీ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు సిద్ధమయ్యాయి. వీటిని అభ్యర్థులు గురువారం నుంచి ఈ నెల 24 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నట్లు వివరించారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రుసుమును ఏపీ ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. దీనిపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని, తుది నిర్ణయం కమిటీదేనని కన్వీనర్ స్పష్టంచేశారు.

 ఇంటర్ ర్యాంకులు రాని వారు డిక్లరేషన్ ఇవ్వాలి
 రెగ్యులర్ ఇంటర్‌మీడియట్ విద్యార్థుల్లో ఎవరికైనా ర్యాంక్ కేటాయించకపోతే వారు దరఖాస్తులో ఇంటర్ హాల్‌టిక్కెట్ సంఖ్యను తప్పుగా నమోదు చేసి ఉంటారని చెప్పారు. అలాంటి విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు డౌన్‌లోడ్ చేసుకున్న డిక్లరేషన్ ఫారం పూరించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఎంసెట్ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. ఇతర ఇంటర్‌మీడియట్ బోర్డుల అభ్యర్థులు ఫారం-డితో పాటు ఇంటర్ మార్కులు, మార్కుల ధ్రువపత్రంపై గెజిటెడ్ అధికారి సంతకంతో అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement