Eamcet engineering
-
ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం నాటికి 3,38,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,037 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,370 మంది ఉన్నారు. ఈ మొత్తం దరఖాస్తులు గతేడాది ఆలస్య రుసుముతో చివరి గడువు నాటికి వచ్చిన వాటికంటే అధికంగా ఉండటం విశేషం. ఏపీ ఈఏపీసెట్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో 12వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మంగళవారం నుంచి అభ్యర్థులకు cets.apsche.ap gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు. మొత్తం 47 పరీక్ష కేంద్రాలు మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం రోజుకు రెండు సెషన్లలో.. ఆన్లైన్లో.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జేఎన్టీయూ అనంతపురం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగంలో ఆబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇలా ఇంజనీరింగ్ విభాగంలో గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఫార్మా విభాగంలో బయాలజీ 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. హాల్టికెట్లలో తేడాలుంటే.. ఏపీ ఈఏపీసెట్ హాల్టికెట్లలో తేడాలుంటే 08554–23411, 232248 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలపవచ్చని, లేదా జ్ఛి pఛ్ఛీటజ్చుp్ఛ్చpఛ్ఛ్టి–2023ః జఝ్చజీ .ఛిౌఝకు మెయిల్ పంపవచ్చని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు తెలిపారు. హాల్‌టికెట్ల వెనుక వైపు బస్టాండు నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన మార్గాన్ని ముద్రించినట్లు చెప్పారు. ఉదయం సెషన్లో 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని వారు పేర్కొన్నారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు
వెబ్సైట్లో డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్/కాకినాడ: ఏపీ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు సిద్ధమయ్యాయి. వీటిని అభ్యర్థులు గురువారం నుంచి ఈ నెల 24 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్జీ’ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు వివరించారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రుసుమును ఏపీ ఆన్లైన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. దీనిపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని, తుది నిర్ణయం కమిటీదేనని కన్వీనర్ స్పష్టంచేశారు. ఇంటర్ ర్యాంకులు రాని వారు డిక్లరేషన్ ఇవ్వాలి రెగ్యులర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఎవరికైనా ర్యాంక్ కేటాయించకపోతే వారు దరఖాస్తులో ఇంటర్ హాల్‌టిక్కెట్ సంఖ్యను తప్పుగా నమోదు చేసి ఉంటారని చెప్పారు. అలాంటి విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు డౌన్లోడ్ చేసుకున్న డిక్లరేషన్ ఫారం పూరించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఎంసెట్ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. ఇతర ఇంటర్మీడియట్ బోర్డుల అభ్యర్థులు ఫారం-డితో పాటు ఇంటర్ మార్కులు, మార్కుల ధ్రువపత్రంపై గెజిటెడ్ అధికారి సంతకంతో అందజేయాలని సూచించారు. -
8 నుంచి టీ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 12వ తేదీన ఆప్షన్స్‌ను, 15 వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 21 తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 23 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో దశ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 25న ఆప్షన్స్, 28న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 1 నుంచి తరగతులు జరుగుతాయి. -
పోలీసు పహారాలో కౌన్సెలింగ్
నెల్లూరు(విద్య) : ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారీ పోలీసు బందోబస్తు నడుమ కౌన్సెలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గత కౌన్సెలింగ్లకు భిన్నంగా హెల్ప్‌లైన్ సెంటర్ల వద్ద ప్రైవేటు కళాశాలల పీఆర్ఓలు, మీడియేటర్ల జాడ కనబడలేదు. పోలీసుల కనుసన్నల్లో కౌన్సెలింగ్ జరగడం విద్యార్థులకు ఒకింత భయం కలిగించినప్పటికీ ప్రశాంతమైన వాతావరణం నెలకొనడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రచారకార్యక్రమాలు, ప్లెక్సీలకు అవ కాశం ఇవ్వలేదు. నిబంధనలను పోలీసులు పకడ్బందీగా పాటించడంతో ప్రలోభాలకు అవకాశం లేకుం డాపోయింది. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఓ యువకుడు తమ కళాశాలకు చెందిన కరపత్రాలు పంచుతుండగా పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం హడావుడి చేశాయి. వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. ప్లెక్సీలను తొలగించాలని కోరారు. కొన్ని ప్రైవేటు కళాశాలలకు కొన్ని విద్యార్థి సంఘాలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ స్థానిక దర్గామిట్ట ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1 నుంచి 7,500 ర్యాంకుల వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో 185 విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థి సంఘాల ఆరోపణలపై వాస్తవాలను తెలియజేయాల్సిందిగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ మగ్బూల్, నాల్గో నగర సీఐల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ నిర్ణీత సమయానికి ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అధికారి రాకపోవడంతో ఆ విద్యార్థులు ఆందోళన చెందారు. ఎస్టీ అభ్యర్థుల పరిశీలనా అధికారి ఆలస్యంగా రావడంతో ఆ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 7,501 నుంచి 15వేల ర్యాంకుల వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనలో 250 మంది హాజరయ్యారు. నేటి కౌన్సెలింగ్‌లో... వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 7,501 నుంచి 15,000 ర్యాంకుల వరకు, దర్గామిట్ట ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం 15,001 నుంచి 22,500 ర్యాంకు వరకు, సర్టిఫికెట్ల పరిశీలనా ప్రక్రియ నిర్వహిస్తామని ప్రిన్సిపల్స్ రామమోహన్, నారాయణలు తెలిపారు. అవకతవకలు లేకుండా చూడాలి: కౌన్సెలింగ్ ప్రక్రియలో అవకతవకలకు తావివ్వకుండా నిర్వహించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు సర్వేపల్లి విశ్వరూపాచారి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విద్యాసంస్థల పీఆర్ఓలు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు అందజేస్తామని, తమ కళాశాలలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్‌కుమార్‌రెడ్డి, నాయకులు జగదీష్, మన్సూర్, సమి, అశోక్, శివ, గణేష్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. సక్రమంగా నిర్వహించాలి... ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను సక్రమంగా నిర్వహించాలని ఏపీ ప్రత్యేకహోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ దాసరి అంజయ్య డిమాండ్ చేశారు. స్థానిక దర్గామిట్ట మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌కు ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులను మోసం చేసే ప్రైవేట్ యాజమాన్యాల చర్యలను అరికట్టాలని కోరారు. వై. రాజా, ఎన్.ఉదయ్, రామకృష్ణ, టోనీ తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. -
ఏం సెట్టో!
ప్రొద్దుటూరు: జిల్లాలో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులపరిస్థితి అగమ్యగోచరంగా మారింది.నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జూలైఆఖరు నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించాల్సి ఉంది. సుప్రీంకోర్టుకూడా గతంలో ఈ ఆదేశాలను జారీచేసింది. అయితే ఈ ఏడాది ఇంజినీరింగ్కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈపరిస్థితి ఏర్పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ రాష్ట్రం విధిస్తున్న ఆంక్షలుసర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఎలాచెల్లిస్తామనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. ఈ కారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షకుసంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. తొలి విడత, రెండో విడత కౌన్సెలింగ్పూర్తి అయిన తర్వాత తరగతులను ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రకారం అక్టోబర్లోకానీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశంలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ అయోమయ పరిస్థితుల కారణంగావిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. కొందరు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డిగ్రీకూడా చేరే ఆలోచనలో ఉన్నారని పలువురువిద్యార్థులు చెబుతున్నారు. అడ్మిషన్లుఆలస్యంగా జరిగితే సిలబస్ పూర్తికాకఇబ్బందులు పడాల్సి వస్తుందని, తద్వారావిద్యార్థి భవిష్యత్తుకు పునాది అయినఇంజనీరింగ్లో నష్టపోతామని విద్యార్థులుచెబుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో చదివేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏ కళాశాల ఎలా ఉంది అనే విషయంపై అధ్యాపకులతో చర్చిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లుతెలుస్తోంది. తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.జిల్లాలో 22 కళాశాలలు జిల్లాలో ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల, పులివెందులలోని జేఎన్టీయూఇంజనీరింగ్ కళాశాలతోపాటు మరో 20ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కడపపరిధిలో 8, ప్రొద్దుటూరు పరిధిలో 6 ఇంజనీరింగ్ కళాశాలు నడుస్తున్నాయి. ఈ ప్రకారందాదాపు వీటిలో 10వేల సీట్లు ఉన్నాయి. గతఏడాది మాత్రం 5500 సీట్లు భర్తీ అయినట్లుతెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మే 22నఎంసెట్ పరీక్ష నిర్వహించగా 7100 మందివిద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్పరిధిలో 170 ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా అక్కడ చేరేవారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని జిల్లాలోని ప్రైవేటుకళాశాలల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో వీరు కూడాఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు లైన్ క్లియర్
-
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు లైన్ క్లియర్
హైదరాబాద్ : విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయాయి. ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వారం ముందు విడుదల చేయాలని సూచించింది. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని వెబ్సైట్లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్ నిర్వహించగా, జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి.