ప్రొద్దుటూరు: జిల్లాలో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులపరిస్థితి అగమ్యగోచరంగా మారింది.నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జూలైఆఖరు నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించాల్సి ఉంది. సుప్రీంకోర్టుకూడా గతంలో ఈ ఆదేశాలను జారీచేసింది. అయితే ఈ ఏడాది ఇంజినీరింగ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈపరిస్థితి ఏర్పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ రాష్ట్రం విధిస్తున్న ఆంక్షలుసర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఎలాచెల్లిస్తామనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. ఈ కారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షకుసంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. తొలి విడత, రెండో విడత కౌన్సెలింగ్‌పూర్తి అయిన తర్వాత తరగతులను ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రకారం అక్టోబర్‌లోకానీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశంలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
ఈ అయోమయ పరిస్థితుల కారణంగావిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. కొందరు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డిగ్రీకూడా చేరే ఆలోచనలో ఉన్నారని పలువురువిద్యార్థులు చెబుతున్నారు. అడ్మిషన్లుఆలస్యంగా జరిగితే సిలబస్ పూర్తికాకఇబ్బందులు పడాల్సి వస్తుందని, తద్వారావిద్యార్థి భవిష్యత్తుకు పునాది అయినఇంజనీరింగ్‌లో నష్టపోతామని విద్యార్థులుచెబుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో చదివేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏ కళాశాల ఎలా ఉంది అనే విషయంపై అధ్యాపకులతో చర్చిస్తున్నారు.
ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లుతెలుస్తోంది. తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.జిల్లాలో 22 కళాశాలలు జిల్లాలో ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల, పులివెందులలోని జేఎన్‌టీయూఇంజనీరింగ్ కళాశాలతోపాటు మరో 20ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కడపపరిధిలో 8, ప్రొద్దుటూరు పరిధిలో 6 ఇంజనీరింగ్ కళాశాలు నడుస్తున్నాయి.
ఈ ప్రకారందాదాపు వీటిలో 10వేల సీట్లు ఉన్నాయి. గతఏడాది మాత్రం 5500 సీట్లు భర్తీ అయినట్లుతెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మే 22నఎంసెట్ పరీక్ష నిర్వహించగా 7100 మందివిద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌పరిధిలో 170 ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా అక్కడ చేరేవారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని జిల్లాలోని ప్రైవేటుకళాశాలల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో వీరు కూడాఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏం సెట్టో!
Published Sun, Jul 13 2014 3:09 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement