బాలాజీచెరువు (కాకినాడ) : ఏపీ ఎంసెట్-2016కు ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు సంబంధించి ఇప్పటివరకూ 2,02,249 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్టును ఈ నెల 20వ తేదీలోగా ఎంసెట్ ఈ-మెయిల్‌కు పంపించాలన్నారు.
మూడేళ్లుగా ఎంసెట్ రాస్తున్నవారి జాబితా తమవద్ద ఉందని, వారు పరీక్షకు ఎందుకు హాజరవుతున్నారన్న విషయంపై ఇంటెలిజెన్స్ విభాగంతో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. మే 2న జరిగే తెలంగాణ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 2356255 ఫోన్ నంబర్లలో సంప్రందించవచ్చని సాయిబాబు సూచించారు.
ఏపీ ఎంసెట్‌కు 2,02,249 దరఖాస్తులు
Published Tue, Mar 15 2016 8:35 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement
Advertisement