సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్‌తో సహా వివిధ సెట్ల నిర్వహణకోసం హైదరాబాద్‌లో 18 కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించే 7 సెట్లకు సంబంధించిన తేదీల్లో కేంద్రీయ విద్యాసంస్థల పరీక్షలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి మంత్రి గంటా శ్రీనివాసరావును కలసి ఈ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. సెట్ల నిర్వహణకు వీలుగా ఏర్పాట్ల కోసం త్వరలోనే ఈ కేంద్రాలను తమ అధికారులు సందర్శించనున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లో 18 కేంద్రాల్లో ఏపీ ఎంసెట్
Published Wed, Mar 11 2015 12:53 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement