ఏపీ ఎంసెట్-2016 బైపీసీ స్ట్రీమ్ అభ్యర్ధులకు ఫార్మా డీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17వ తేదీనుంచి ప్రాంభం కానుంది. ఈనెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకొనేందుకు అవకాశమివ్వనున్నారు. 18వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటో ర్యాంకరునుంచి చివరి ర్యాంకరు వరకు ఇందులో పాల్గొనేందుకు అవకాశముంది. ఈనెల 20వ తేదీన ఆన్‌లైన్ ద్వారా సీట్ల కేటాయింపు చేయనున్నామని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి ఒకప్రకటనలో వివరించారు. అభ్యర్ధులు ఇప్పటికే సీట్లు పొంది వేరే కాలేజీల్లో చేరి మార్పును కోరుకుంటే వారికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తిరిగి ఇవ్వాలని కన్వీనర్ సూచించారు.
ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
Published Wed, Aug 10 2016 7:30 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement
Advertisement