b pharmacy
-
ఫార్మసీ కోర్సులు.. కెరీర్ అవకాశాలు
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ఔషధశాలగా భారత్ పేరొందుతోంది. నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు అభ్యసించొచ్చు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ.. అనేక ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఫార్మసీకోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ప్రధానంగా మూడు రకాల ఫార్మసీ కోర్సులున్నాయి. డి.ఫార్మసీ(డిప్లొమా ఇన్ ఫార్మసీ), బీఫార్మసీ(బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ), ఫార్మ్–డి(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ). ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. డి.ఫార్మసీ ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర సాంకేతిక శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: డి–ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మందుల దుకాణాలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, సేల్స్, మార్కెటింగ్, పరిశోధనా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ► ఉన్నత విద్య: డి.ఫార్మసీ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈసెట్ పరీక్షలో అర్హత సాధించి.. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఫార్మ్–డి కోర్సులను కూడా అభ్యసించొచ్చు. బీఫార్మసీ ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ/డి.ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ పూర్తి చేసినవారు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: బీఫార్మసీలో ఉత్తీర్ణులకు పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఫార్మసిస్ట్‌లుగా చేరొచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ అండర్ రైటర్లుగా పనిచేయొచ్చు. సొంతంగా మందుల దుకాణాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఫార్మస్యూటికల్, బయోటెక్ కంపెనీల్లో రీసెర్చ్ సైంటిస్టు, రీసెర్చ్ అసోసియేట్, ప్రీ క్లినికల్ రీసెర్చ్‌లో.. స్టడీ డైరెక్టర్, క్యూసీ మేనేజర్, క్యూసీ ఆడిటర్, క్యూసీ అసోసియేట్ కొలువులు; ఫార్మా ఇండస్ట్రీలో.. ఫార్ములేషన్స్ ఆర్ అండ్ డీ, అనలిటికల్ ఆర్ అండ్ డీ, క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో అవకాశాలు పొందొచ్చు. ఫార్మ్–డి ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మ్–డి కోర్సులో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు. కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్లు తరగతిగది బోధన, ప్రాక్టికల్స్‌తోపాటు.. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్–డి కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగ అవకాశాలు: ఫార్మ్–డి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్లినికల్ ఫార్మసిస్టు, కమ్యూనిటీ ఫార్మసిస్టు, హాస్పిటల్ ఫార్మసిస్టుగా అవకాశాలు లభిస్తాయి. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్లో ఏడీఆర్ మానిటరింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ మానిటరింగ్, టాక్సికాలజీ, థెరప్యూటిక్స్, బీఏబీఈ స్టడీస్, పేషెంట్ మానిటరింగ్, క్లినికల్ ప్రోటోకాల్ డెవలప్మెంట్, పేషెంట్ కేస్ స్టడీ, పేషెంట్ కౌన్సెలింగ్, క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్మెంట్ వంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలలోనూ వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. పరిశోధనలపై దృష్టిసారించాలనుకుంటే.. పీహెచ్డీ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ) ► బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఎంఫార్మసీలో ఫార్మాస్యుటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అస్యూరెన్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ► నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీ)నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశంలోని పలు యూనివర్సిటీలు ఎంఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు జీప్యాట్ స్కోరుతో తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► నైపర్ జేఈఈ రాసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ► అంతర్జాతీయ అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్(ఫార్మాస్యూటికల్ సైన్సెస్)తో పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో చేరే అవకాశముంది. ► బీఫార్మసీ తర్వాత మూడేళ్ల ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)లో చేరవచ్చు. ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)ను లేటరల్ ఎంట్రీగా పరిగణిస్తారు. బీఫార్మసీ తర్వాత ఫార్మ్–డిలో నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఫార్మసీ–మేనేజ్మెంట్ కోర్సులు ► ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. దాంతో నైపర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ(ఫార్మ్) వంటి ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే ఎంటెక్(ఫార్మసీ), ఎంఎస్(ఫార్మ్) లాంటి వినూత్న కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు వీటిలో చేరొచ్చు. పీహెచ్డీ ► నైపర్లతోపాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర ఇన్స్టిట్యూట్లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్‌తో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా రంగం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఫార్మసీలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అవకాశాలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఫార్మా రంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తృతమవుతాయి. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్ రేటింగ్స్, డేటా అనాలిసిస్ విభాగాలతోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చు. పీహెచ్‌డీతోపాటు విదేశాల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించి పరిశోధన దిశగా అడుగులు వేయొచ్చు. అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడొచ్చు. – ఎన్.శంకరయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, నైపర్ హైదరాబాద్. -
నవంబర్ 1 నుంచి ఫస్టియర్‌కు క్లాసులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో తరగతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి సీనియర్ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మొదలుకానుండగా.. ఫస్టియర్ విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవనున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతి (క్లాస్‌రూం)లో నిర్దేశించిన విధంగా సీనియర్ విద్యార్థులకు తొలుత బోధన పెట్టాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాఠ్యాంశ బోధనతో పాటు కళాశాలల గుర్తింపు, మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ తదితర కార్యకలాపాలపైన స్పష్టమైన తేదీలను సూచించింది. ఇక సాంకేతిక, వృత్తి విద్య యూజీ, పీజీ కోర్సు (బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర) ల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ ఒకటో తేదీ నాటికి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన అకడమిక్ క్యాలెండర్ 2020–21ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ క్యాలెండర్ ఆధారంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినప్పటికీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు చేస్తే మార్పులు చేసే అవకాశముంటుందని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్లో సవరణలివే... ►సెప్టెంబర్ 1 నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తి కానందు న వారిని మినహాయించి మిగతా తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభించా లి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో లేకుంటే బ్లెండెడ్ మోడ్ (రెండు విధాలుగా)లో బోధన చేపట్టొచ్చు. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులకు మాత్రం బోధన తరగతుల నిర్వహణకు ఈ తేదీ వర్తించదు. ►ప్రతి విద్యా సంస్థకు సంబంధిత యూనివర్సిటీ లేదా బోర్డు అనుబంధ గుర్తింపునిస్తుంది. ఈ ప్రక్రియ వాస్తవానికి మే నెల15వ తేదీలోగా పూర్తి కావాలి. తాజాగా ఈ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించింది. నిర్దేశించిన గడువులోగా విద్యా సంస్థను తనిఖీ చేసి మౌలిక వసతులు, సౌకర్యాలను పూర్తిగా పరిశీలించి ఆమేరకు అనుబంధ గుర్తింపును జారీ చేయాలి. ►వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్లను త్వరితంగా నిర్వహించి అక్టోబర్ 20వ తేదీ నాటికి తొలి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆమేరకు అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ►అదేవిధంగా నవంబర్ ఒకటో తేదీ నాటికి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ ఒకటో తేదీ నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. అదే రోజు నుంచి ఫ్రెషర్స్‌కు తరగతులు ప్రారంభమవుతాయి. ►వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే నవంబర్ 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలి. మొత్తంగా 15వ తేదీ నాటికి కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఏఐసీటీఈ ఏప్రిల్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను తొలుత విడుదల చేసినప్పటికీ కోవిడ్ నేపథ్యంలో మార్పులు చేసి జూలై 2న సవరించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. అయితే విద్యా సంస్థలు తెరిచేందుకు కేంద్రం అనుమతినివ్వలేదు. ఈక్రమంలో వీటి మూసివేత ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వివిధ సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం వెసులుబాటునిస్తూ వచ్చిం ది. దీంతో వచ్చేనెలలో విద్యా సంస్థలు తెరుచుకుంటాయని సంకేతాలు వస్తుండటంతో ఏఐసీటీఈ తాజాగా మరిన్ని సవరణలు చేసిన అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ విడుదల చేశారు. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్–2017లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సి.శశిధర్ శుక్రవారం తెలిపారు. బీఫార్మసీ మొదటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం మొదటి , రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం http://jntuaresults.azurewebsites.net ద్వారా తెలుసుకోవాలన్నారు. -
బీటెక్, బీఫార్మసీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో డిసెంబర్–2016లో జరిగిన బీటెక్, బీఫార్మసీ (ఆర్–15) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. మార్కుల వివరాల కోసం వర్సిటీ వెబ్‌పోర్టల్‌ను సంప్రదించాలని సూచించారు. -
16 నుంచి బీ ఫార్మసీ పరీక్షలు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి బీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 19, 21, 23, 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, 17వ తేదీ నుంచి మూడో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు జ రుగుతాయని వివరించారు. థర్డ్ ఇయర్ వారికి 17న పేపర్–1 మెడిసినల్ కెమిస్ట్రీ–1 (నేచురల్ ప్రొడక్ట్), 20న పేపర్–2 ఫార్మాకాగ్నసీ, 22న థర్డ్పేపర్ ఫార్మకాలజీ, 24న పేపర్–4 ఫార్మస్యూటికల్ జూరిప్రుడెన్స్ పరీక్ష నిర్వహిస్తామని పే ర్కొన్నారు. మూడో సంవత్సరం వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతాయన్నారు. -
బీ ఫార్మశీ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల: బీ పార్మశీ రెండో విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీం విద్యార్థులకు ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమాయ కేంద్రంలో బుధవారం ధృవీకరణ పత్రాలు పరిశీలించగా, 26 మంది హాజరయ్యారు. వీరిలో 12 మంది ఓసీ, బీజీ విద్యార్థులు ఉండగా, 14 మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. గురువారంతో ధృవీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల ఎంట్రీ ముగియనుంది. క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షించారు. -
ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్-2016 బైపీసీ స్ట్రీమ్ అభ్యర్ధులకు ఫార్మా డీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17వ తేదీనుంచి ప్రాంభం కానుంది. ఈనెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకొనేందుకు అవకాశమివ్వనున్నారు. 18వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటో ర్యాంకరునుంచి చివరి ర్యాంకరు వరకు ఇందులో పాల్గొనేందుకు అవకాశముంది. ఈనెల 20వ తేదీన ఆన్లైన్ ద్వారా సీట్ల కేటాయింపు చేయనున్నామని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి ఒకప్రకటనలో వివరించారు. అభ్యర్ధులు ఇప్పటికే సీట్లు పొంది వేరే కాలేజీల్లో చేరి మార్పును కోరుకుంటే వారికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తిరిగి ఇవ్వాలని కన్వీనర్ సూచించారు. -
‘మిట్స్’లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
చిలుకూరు : మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి బుధవారం కాలేజీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు చెందిన కె.రామకృష్ణ మిట్స్ కళాశాలలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు రాయాలంటే 65శాతం హాజరు నమోదు కావాల్సి ఉండగా సదరు విద్యార్థికి 64.8 శాతం ఉంది. అయితే హాజరు శాతం తక్కువగా విద్యార్థులను బీఫార్మస్సీ హెచ్ఓడీ కొన్ని రోజలుగా వేదిస్తున్నట్లుగా తెలిసింది. హాజరు శాతం తక్కువుగా ఉన్నదని ఫైనల్ పరీక్షలు రాయడానికి వీలు లేదని సంవత్సరం వృథా అవుతుందని భయపెట్టడంతో రామకృష్ణ ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. అదనపు ఫీజు కోసం.. రామకృష్ణకు హాజరు శాతం తక్కువుగా ఉండటంతో అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని బీ ఫార్మసీ హెచ్ఓడీ వేదిస్తున్నట్లుగా పలువురు విద్యార్థులు ఆరోపించారు. అంతేకాకుండా కళాశాలకు రాని రోజులకు ఒక్కో రోజుకు రూ. 500 చొప్పున అదనపు రుసుం వేశారని పేర్కొన్నారు. దీంతో రామకృష్ణ నాలుగు రోజుల కళాశాలకు రాకపోవడంతో అతనికి అదనంగా రూ. 2వేలు ఫైన్ వేశారని తెలిపారు. మొత్తం రూ. 12 వేలు తెస్తేనే కళాశాలకు రావాలని, లేకుంటే రావద్దనడమే కాకుండా ఈ ఏడాది ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌కు అనుమతించబోమని చెప్పడంతో రామకృష్ణ మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయమై బుధవారం తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందేనని మంగళవారం విద్యార్థికి హెచ్ఓడీ సీరియస్‌గా చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని భయట ఎవరికైనా చెప్పినా మార్కులు తక్కువగాగా వేస్తామని , ప్రాక్టికల్స్‌లో ఫైయిల్ చేస్తామని కూడా బెదిరించినట్లుగా వారు ఆరోపించారు. అదనపు ఫీజు వసూలు చేయలేదు -నర్సిరెడ్డి, మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలో అదనపు ఫీజులు వసూలు చేయడం లేదు. విద్యార్థిని కూడా ఎలాంటి వేదింపులకు గురి చేయలేదు. అతని ఇంటి వద్ద ఉన్న సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడగానే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి బాధిత విద్యార్థిని కూడా వారికి అప్పడించాం. కళాశాలకు పురుగుల మందు డబ్బాతో... వేదింపులు తట్టుకోలేక రామకృష్ణ రోజు వారిగానే కళాశాలకు వచ్చేటప్పుడు పుస్తకాలతో పాటుగా పురుగుల మందు తీసుకొని వచ్చాడు. కళాశాల ప్రారంభం కాగానే కొద్ది సేపటికి పురుగుల మందు తాగడంతో తోటి విద్యార్థులు గమనించి చికిత్స నిమిత్తం హూజర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వెంటనే కళాశాల నిర్వాహకులు బాధితుని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది. మండిపడుతున్న విద్యార్థులు జరిగిన సంఘటన నేపథ్యంలో కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎవరైనా చెల్లించకపోతే వేదించడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఫార్మసీ సీట్ల కేటాయింపు, 9,106 సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జాబితా సోమవారం రాత్రి విడుదలైంది. సీట్ల వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా చేరవేశారు. ఎంసెట్ బైపీసీ విభాగంలో 85,741 మంది అర్హత సాధించగా.. వారిలో ఫార్మసీ కోర్సుల కోసం 14,724 మంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. అందులో 13,696 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 9,401 ఫార్మసీ సీట్లు ఉండగా.. 9,106 సీట్లు భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 8,506 సీట్లకుగాను 8,326 సీట్లు.. ఫార్మా-డిలో 741 సీట్లు, బయోటెక్నాలజీలో 154 సీట్లకు గాను 39 నిండాయి. సీటు పొందిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కట్టాల్సి ఉంటే చలానా ద్వారా బ్యాంకులో చెల్లించాలి. ఆ రశీదులతో 27లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. 29 నుంచి తుది కౌన్సెలింగ్: ఎంసెట్ బైపీసీ విభాగం అభ్యర్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. వచ్చే నెల ఒకటిన సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటనను ఈ నెల 25న వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఎంపీసీ విభాగంలో మిగిలిపోయే సీట్లను తుది విడత బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్ ఖమ్మంనగరంలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థిపై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఖమ్మంటూటౌన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మరిపెడకు చెందిన ఇస్లావత్ రాము ఖమ్మంనగరంలోని ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతూ లెనిన్‌నగర్‌లో ఉంటున్నాడు. ఎన్ఎస్టీ రోడ్‌లోని రైతు బజార్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఖమ్మంనగరంలో బీఫార్మసీ చదువుతోంది. రాము సంవత్సర కాలంగా ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేకుంటే చంపేస్తానని ఆ విద్యార్థినిని వేధిస్తున్నాడు. బుధవారం ఇంట్లో ఆ విద్యార్థిని ఒంటరిగా ఉండగా రాము వెళ్లి క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. దీంతో ఆ విద్యార్థిని స్నేహితులు గురవారం రాము ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనల్లో వారి ద్దరికి గాయాలయ్యాయి. ఇరువురు ఒకరిపై ఒ కరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన వెబ్ కౌన్సెలింగ్ గడువు
హైదరాబాద్ : గత అర్థరాత్రితో ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్‌కు గడువు ముగిసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా.. వీరిలో 1,28,716 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఐసెట్-2013లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు లక్షా 21వేల మంది ఉండగా.. కౌన్సెలింగ్‌కు సగం మంది ర్యాంకర్లు మాత్రమే హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన గడువు ముగిసింది. అయితే ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దాదాపు లక్షా 20వేలు అందుబాటులో ఉన్నాయని ఐసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి తెలిపారు.