యువతిపై ప్రేమోన్మాది దాడి | m tech student attacks on woman | Sakshi
Sakshi News home page

యువతిపై ప్రేమోన్మాది దాడి

Published Fri, Sep 20 2013 2:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

m tech student attacks on woman


 ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్
 ఖమ్మంనగరంలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థిపై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఖమ్మంటూటౌన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మరిపెడకు చెందిన ఇస్లావత్ రాము ఖమ్మంనగరంలోని ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతూ లెనిన్‌నగర్‌లో ఉంటున్నాడు. ఎన్‌ఎస్‌టీ రోడ్‌లోని రైతు బజార్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఖమ్మంనగరంలో బీఫార్మసీ చదువుతోంది.
 
  రాము సంవత్సర కాలంగా ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేకుంటే చంపేస్తానని ఆ విద్యార్థినిని వేధిస్తున్నాడు. బుధవారం ఇంట్లో ఆ విద్యార్థిని ఒంటరిగా ఉండగా రాము వెళ్లి క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. దీంతో ఆ విద్యార్థిని స్నేహితులు గురవారం రాము ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనల్లో వారి ద్దరికి గాయాలయ్యాయి. ఇరువురు ఒకరిపై ఒ కరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement