ఏపీ ఎంసెట్‌కు హైదరాబాద్‌లో రీజినల్ సెంటర్లు | Regional centers declared in Hyderabad for AP EAMCET | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌కు హైదరాబాద్‌లో రీజినల్ సెంటర్లు

Published Mon, Feb 29 2016 7:19 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

Regional centers declared in Hyderabad for AP EAMCET

కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : ఏపీ ఎంసెట్-16కు సంబంధించి హైదరాబాద్‌లో రెండు రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు కాకినాడలో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెహదీపట్నం పరిసరాల్లో టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంపట్నం, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలను హైదరాబాద్ జోన్-ఎగా, చందానగర్, బీహెచ్‌ఈఎల్ , పటాన్‌చెరువు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, ధూలపల్లి ప్రాంతాలను జోన్-బిగా కేటాయించినట్టు తెలిపారు.

ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కావాలనుకుంటే రీజినల్ సెంటర్లను మార్చి 2, 3, 4 తేదీల్లో మార్చుకోవాలని, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో మార్పులకు ఏప్రిల్ 3 నుంచి 9 వరకూ అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్షా పదివేల దరఖాస్తులు వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement