Regional centers
-
రైతన్నలకు ఆసరాగా.. ‘వైఎస్సార్ అగ్రిల్యాబ్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు కానున్నాయి. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. 147 గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు, ఒక రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అగ్రిల్యాబ్‌లకు అవసరమైన పరికరాల కొనుగోలుకు తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. నియోజకవర్గ స్థాయి పరీక్షా కేంద్రాల్లో విత్తనాల నాణ్యతను పరీక్షిస్తారు. జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ విత్తనాల జన్యుపరమైన పరీక్షలు జరుగుతాయి. విత్తన ఆరోగ్యం, మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? కొత్త విత్తనమా? పాత విత్తనమా? అనే వివరాలు తెలుసుకోవచ్చు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిన్నింటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టేడమే లక్ష్యంగా అగ్రిల్యాబ్‌లు పనిచేయనున్నాయి. పరీక్షల అనంతరం నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాటిని తయారు చేసిన సంస్థలు, విక్రయించిన వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు చేపడుతుంది. ‘నాబార్డు’ ఆర్థిక సాయంతో ఏర్పాటు కానున్న అగ్రిల్యాబ్‌లను మార్కెటింగ్, పోలీస్ హౌసింగ్ శాఖలు నిర్మిస్తాయి. -
ఏపీ ఎంసెట్‌కు హైదరాబాద్‌లో రీజినల్ సెంటర్లు
కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : ఏపీ ఎంసెట్-16కు సంబంధించి హైదరాబాద్‌లో రెండు రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు కాకినాడలో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెహదీపట్నం పరిసరాల్లో టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంపట్నం, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలను హైదరాబాద్ జోన్-ఎగా, చందానగర్, బీహెచ్ఈఎల్ , పటాన్చెరువు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, ధూలపల్లి ప్రాంతాలను జోన్-బిగా కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కావాలనుకుంటే రీజినల్ సెంటర్లను మార్చి 2, 3, 4 తేదీల్లో మార్చుకోవాలని, ఆన్లైన్ దరఖాస్తుల్లో మార్పులకు ఏప్రిల్ 3 నుంచి 9 వరకూ అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్షా పదివేల దరఖాస్తులు వచ్చాయన్నారు. -
వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
- అంబేడ్కర్ వర్సిటీ సేవల వివాదంపై హైకోర్టు - ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ కేంద్రాలకు సేవల నిలుపుదల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు గురువారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువునిచ్చింది. అప్పటి వరకూ ప్రాంతీయ కేంద్రాలకు సేవలందించాలని టీ సర్కార్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేర కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైం దని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ గత నెల 25న సాక్షి ‘కథనం’ ప్రచురించింది. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏజీ కొండం రామకృష్ణారెడ్డి ఏపీ తమతో ఒప్పందం కుదుర్చుకోనప్పుడు సేవలం దించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏపీ ఏజీ పరాంకుశం వేణుగోపాల్ వాదనలు విని పిస్తూ సార్వత్రిక వర్సి టీ కార్పస్ ఫండ్ కింద రూ.400 కోట్లు ఉన్నాయని చెప్పగా ‘కార్పస్ ఫండ్‌లో నుంచి కొంత మొత్తాన్ని ఏపీ ప్రాంతీ య కేంద్రాలకు వెచ్చించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి?’ అని రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ధర్మా సనం వ్యాఖ్యానించింది. సార్వత్రిక వర్సిటీ రెండేళ్ల ఆస్తిఅప్పుల పట్టీలను తమ ముందుం చాలని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది.