యూనివర్సిటీ : ఏపీఎంసెట్-2015 కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూనివర్సిటీలలోని హెల్ప్‌లైన్ కేంద్రాలలో సజావుగా ప్రారంభమైంది. ఉదయం నుంచే జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు పనిచేశాయి. ఈసారి త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు కౌన్సెలింగ్‌కు భారీగా హాజరయ్యారు. ఎస్కేయూ ఇంఛార్జ్ వీసీ ఆచార్య కె.లాల్‌కిశోర్, రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్య వర్సిటీలోని హెల్పలైన్ కేంద్రాన్ని పరిశీలించారు. గణనీయమైన ర్యాంకు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌లను అందించారు.
విద్యార్థి పేరెంట్ తప్పనిసరి: సర్టిఫికెట్ పరిశీలనకు విద్యార్థితో పాటు పేరెంట్ తప్పనిసరిగా ఉండాలి. కుల ద్రువీకరణ పత్రం, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు కాబట్టి విద్యార్థి తండ్రి లేదా తల్లి, సంరక్షకుడు ఎవరో ఒకరు అంగీకారం తెలిపాలి. ఒక వేళ విద్యార్థి సర్టిఫికేట్స్ నకిలీవని తేలితే వచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ రుసుములను విద్యార్థి తండ్రి, సంరక్షకుడు (గార్డియన్) వెనక్కి కట్టాల్సి ఉంటుంది. ఫీజు మినహాయింపుల గురించి మార్పు, చేర్పులకు అంగీకారం తెలుపుతున్నామని సంతకం చేయాలి.
10 వేల లోపు ర్యాంకు వారికి గరిష్టమెత్తంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్: ఏపీ ఎంసెట్-2015లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఆయా కళాశాలలో నిర్ణయించిన ఫీజు మెత్తాన్ని గరిష్టంగా ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ చేస్తుంది. అటానమస్ (స్వయం ప్రతిపత్తి )కళాశాలల్లో రూ.78 వేలు నుంచి లక్ష వరకు పీజు కట్టించుకుంటారు. ఈ మొత్తాలకు షరతులు లేకుండా ప్రభుత్వం చెల్లిస్తుంది. 10 వేల ర్యాంకు పైన వచ్చిన ఓసీ, బీసీ కేటగిరి విద్యార్థులకు కేవలం రూ.35 వేలు మాత్రమే కన్వీనర్ కోటాలో ప్రవేశించిన వారికి పీజు రీఎంబర్స్‌మెంట్ చేస్తుంది. ఎస్సీ,ఎస్టీ క్యాటగిరి విద్యార్థులకు మాత్రం ఏర్యాంకు వచ్చినా రీఎంబర్సమెంట్ వర్తిస్తుంది.
వెబ్‌ఆప్షన్స్ ఇచ్చేటపుడు సెల్‌ఫోన్ నెంబర్ తప్పనిసరి: ఇంజనీరింగ్ సీట్లు 15 శాతం పూర్తిగా మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇందులో నాన్‌లోకల్ వారు ఉన్నా సీట్లు కేటాయిస్తారు. తక్కిన 85 శాతం ఎస్వీయూ రీజియన్ వారికి ఇంజనీరింగ్ సీట్లు అలాట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ వన్‌టైం పాస్‌వర్డ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా కచ్చితమైన, సొంత సెల్‌ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం మార్క్స్ కార్డ్స్ వెనక్కి ఇచ్చేస్తారు. కారణం తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ ఎవరికి ఇవ్వకూడదు. కళాశాల వారు సెల్‌ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలని మభ్యపెడితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ నెంబర్ 9010221264 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
నేటి కౌన్సెలింగ్ ఇలా..
శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 15001 నుంచి 22500 ర్యాంకు వరకు, ఎస్కేయూనివర్సిటీలో 22501 నుంచి 30 వేల ర్యాంకుల వరకు హాజరుకావాలి. ఎస్టీ కేటగిరికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆది, సోమవారాల్లో 1 నుంచి 30 వేల ర్యాంకుల విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఎంసెట్ కౌన్సెలింగ్ సందడి
Published Sat, Jun 13 2015 2:48 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM
Advertisement
Advertisement