
ట్విన్ సిస్టర్స్.. ఆదుర్స్
విజయనగరం అర్బన్: విజయనగరంలోని ట్విన్ సిస్టర్స్(కవలలు)కు ఎంసెట్ మెడికల్ విభాగంలో టాప్ ర్యాంకులు లభించాయి. కొడాలి అలేఖ్య 145 మార్కులతో 62వ ర్యాంక్, అఖిల 126 మార్కులతో 1,275వ ర్యాంక్ సాధించింది. వీరి తల్లిదండ్రులు తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి వృత్తిరీత్యా వైద్యులు. పట్టణంలో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ట్విన్ సిస్టర్స్ అలేఖ్య, అఖిల మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిలేని వాతావరణం లభించడం వల్లే ర్యాంక్ సాధించగలిగామన్నారు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యసేవలను అందించడమే లక్ష్యమని చెప్పారు. జిప్‌మార్, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి మెడికల్ కళాశాలల్లో చదవాలనుకుంటున్నట్లు తెలిపారు.