
సాక్షి, కాకినాడ : ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌టీయూకే ఐఎస్‌టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. వైవా పరీక్షల సందర్భంగా ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సరం విద్యార్థినుల పట్ల బాబులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణాలు ఉన్నాయి.
కాగా ఈ వ్యవహారంపై వర్శిటీ... ఇప్పటికే ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై 254, 254ఎ, 509 సెక‌్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యాయి. ఇవాళ ప్రొఫెసర్ బాబులును అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment