
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు ఆన్ లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ మంగళవారం విజయవాడలో పేర్కొన్నారు.https ://bie.ap.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి నుంచి ఆన్ లైన్లో ఇంటర్మీయట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా ఈనెల 29 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ళ ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కాగా బీసీ,ఓసీ విద్యార్థులకు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చని రామకృష్ణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment