
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా మూతపడిన జూనియర్ కాలేజీల పున:ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే జూనియర్ కాలేజీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు తేదీని జూన్ 30 వరకు పోడగించింది. అంతేగాక ప్రైవేటు ఇంటర్ కాలేజీల రెన్యువల్ తేదీని కూడా జూన్ 30 వరకు పొడగించింది. రూ. 20 వేల ఫైన్ ద్వారా ఆగష్టు 12వ తేదీ వరకు రెన్యువల్స్‌కు అవకాశం ఇచ్చినట్లు బోర్డు పెర్కొంది. కాగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షను తిరగి జూన్ 3వ తేదిన నిర్వహించన్నట్లు తెలిపింది. విద్యార్థులు www.bie.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా బోర్డు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment