విజయవాడ: 2015-16 విద్యాసంవత్సరానికి గాను పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా), పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు శనివారం నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ చెప్పారు.
దరఖాస్తు చేసుకునే విధానం, ప్రవేశ పరీక్ష, ఫీజు వివరాలు http://www.drntruhs.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే ఇతర దేశాల్లో అండర్ గాడ్య్రుయెట్ డిగ్రీ చదివిన విద్యార్థులు ఎంసీఐ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రూ.7 వేలు, ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు రూ.3 వేలుగా ఫీజుగా నిర్ణయించారు. వివరాలు http://ntruhs.inc.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
నేటినుంచి ఆన్‌లైన్‌లో పీజీ మెడికల్ దరఖాస్తులు
Published Sat, Feb 7 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement