టెర్ట్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే..! | TERT applications online only | Sakshi
Sakshi News home page

టెర్ట్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే..!

Published Tue, Dec 2 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

TERT applications online only

 నేడు టీచర్ పోస్టుల భర్తీ మార్గదర్శకాలు విడుదల
 పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి
 దరఖాస్తు నేరుగా డీఈవో కార్యాలయాల్లో ఇస్తే అనుమతించం
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతిని ధ్రువపత్రాలతో డీఈవోకు అందచేయాలి
 రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘టెర్ట్’ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వి.ఉషారాణి సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృత్వంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఒకే పరీక్షగా ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెర్ట్) పేరుతో నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. నేరుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టంచేశారు. తొలుత తమ శాఖ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రొఫార్మాలో పూర్తి చేసి సమర్పించాలని చెప్పారు. అనంతరం అప్లికేషన్ కాపీపై సంతకం చేసి అర్హత, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిపి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మంగళవారం సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.
 
 'ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని 9,061 టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. జిల్లాలవారీగా, కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా, రోస్టర్ వారీగా వివరాలను వెబ్‌సైట్లో పొందుపరుస్తాం. 3వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకోవ చ్చు' అని వివరించారు. నూతన ఉపాధ్యాయులు వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికే పాఠశాలల్లో  చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీని ఈ డీఎస్సీలోనే చేపట్టనున్నారు. మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏజెన్సీ ఏరియాలోని పోస్టులకు ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేయాలి.
 
 'టెర్ట్'నోటిఫికేషన్ వివరాలు
 
 పరీక్ష ఫీజు చెల్లింపు గడువు:    డిసెంబర్ 2 నుంచి జనవరి 16
 (ఏపీ ఆన్‌లైన్, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు)
 దరఖాస్తుల దాఖలుకు గడువు:    డిసెంబర్ 3 నుంచి జనవరి 17
 హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ గడువు:    2015 ఏప్రిల్ 25
 రాత పరీక్షల తేదీలు:                 మే 9, 10, 11
 ఎస్జీటీ పోస్టులకు:                   మే 9
 భాషా పండితులు, పీఈటీ లకు:    మే 10
 స్కూల్ అసిస్టెంట్లకు:                  మే 11
 ప్రాధమిక కీ విడుదల తేదీ:          మే 18
 కీపై ఆన్‌లైన్లో అభ్యంతరాలకు గడువు:    మే 19 నుంచి మే 25 వరకు
 తుది 'కీ'విడుదల:                   మే 27
 ఫలితాల ప్రకటన:                   మే 28    

పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.




Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement