
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీ జీ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష దర ఖాస్తులు అప్‌లోడ్ కాకపోవడంతో వి ద్యార్థులు హైరానా పడుతున్నారు. ఎ స్వీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దరఖాస్తు తుది గడువు శనివారంతో ముగియనుంది. అయితే దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెతా ్తయి. దీంతో దరఖాస్తులు అప్‌లోడ్ కా వడం లేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన సీబీసీఎస్ విధానం ప్రకారం విద్యార్థులు మూడు రెగ్యులర్ పేపర్లతో పాటు ఒక జనరల్ ఎలక్టివ్, ఒక ఓపెన్ ఎలక్టివ్ పేపర్ చదవాల్సి ఉం ది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో జనరల్ ఎలక్టివ్ పేపర్లు ఎం చుకునే కాలమ్‌లో ఒక పేపర్ మా త్రమే ఎంటర్ చేస్తే అప్‌లోడ్ కావడం లేదు.
రెండో పేపర్ ఎంటర్ చేయమ న్న ఆప్సన్ వస్తుంది. వాస్తవానికి వి ద్యార్థులు చదువుతున్నదీ, పరీక్ష రా యాల్సింది ఒక పేపర్ మాత్రమే. అ యితే రెండు జనరల్ పేపర్లు ఎంచుకొనేలా సాఫ్ట్‌వేర్ ఉండడంతో విద్యార్థుల దరఖాస్తులు అప్‌లోడ్ కావడం లేదు. గణితం, ఆక్వాకల్చర్, రసాయ న శాస్త్రం, సాంఖ్యక శాస్త్ర విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. అకడమిక్ విభాగం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ స మస్య తలెత్తిందని కొందరు విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. ఈ స మస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై రె క్టార్ ఎం.భాస్కర్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఈ అంశాన్ని వివిధ విభాగాల వా రితో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.