ఇక ఆన్‌లైన్‌లో హజ్ దరఖాస్తులు | online applications for hajj tour | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్‌లో హజ్ దరఖాస్తులు

Published Sun, Jan 18 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

online applications for hajj tour

 ఈ ఏడాది నుంచే అమలు


 సాక్షి, హైదరాబాద్: ఇకపై హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే యాత్రకు సంబంధించిన ఖర్చులూ చెల్లించవచ్చు. భారతీయ హజ్ కమిటీ ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ సేవలను ప్రారంభించనుంది. హజ్ యాత్ర-2015కు వెళ్లే యాత్రికులు ఠీఠీఠీ.జ్చ్జిఛిౌఝఝజ్ట్ట్ఛ్ఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో హజ్ రుసుము చెల్లించవచ్చు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ.షుకూర్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తులపై ప్రజల్లో అవగాహన లేనందున ఆఫ్‌లైన్ (లిఖితపూర్వకంగా) దరఖాస్తులు సైతం స్వీకరిస్తామన్నారు. ఫారాల పంపిణీని ఈ నెల 19 నుంచి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 20 లోగా తమ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మక్కాలో హజ్-2015 ప్రార్థనలు సెప్టెంబర్ 23న జరగవచ్చని, భారత్ నుంచి యాత్రికుల ప్రయాణాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కావచ్చని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement