hajj tour
-
ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్ర
సాక్షి, అమరావతి: హజ్ (మక్కా) యాత్రకు వెళ్లే రాష్ట్రానికి చెందిన ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ నుంచి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా హజ్ యాత్రికుల కోసం విజయవాడలో ఇమిగ్రేషన్‌కు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఏపీకి చెందిన హజ్ యాత్రికులు ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. ఈ ఏడాది నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లొచ్చు. ఈ అవకాశాన్ని రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలి’ అని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. యాత్ర ఏర్పాట్లపై రూపొందించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సమావేశం నిర్ణయాలను సభ్యులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన బియ్యం కార్డుదారులకు రూ.60 వేలు, రూ. 3 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తోఫా ఇస్తోంది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వడంలేదు. తొలిసారి 70 ఏళ్ల పైబడిన వారు (1953 ఏప్రిల్ 30కి ముందు జన్మించిన వారు) దరఖాస్తు చేసుకుంటే లాటరీతో సంబంధం లేకుండా నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు. 70 ఏళ్లు పైబడిన వారు ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లొచ్చు. అదే విధంగా ఒంటరిగా ఉండే 45 ఏళ్ల పైబడిన మహిళలు కనీసం నలుగురు (2023 ఏప్రిల్ 30 నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలి) కలిసి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఎంపిక చేస్తారు. ఒక వేళ ఇద్దరు మహిళలే దరఖాస్తు చేస్తే, కమిటీ ద్వారా మరో ఇద్దరు మహిళలను కలిపి పంపిస్తారు. ఈసారి 12 ఏళ్ల లోపు చిన్నారులకు సౌదీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. యాత్రకు వెళ్లే వారి కోసం హజ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా హజ్ సొసైటీల ద్వారా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. యాత్రికుల కోసం జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేకంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. వారిని సాగనంపేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు సైతం గన్నవరంలోని ఓల్డ్ ఎయిర్‌పోర్టు, విజయవాడలోని మదరసాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి సహాయార్ధం వలంటీర్లను సైతం నియమిస్తున్నారు. ప్రయాణానికి 48 గంటల ముందు రిపోర్టు చేసే యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మక్కాలో కూడా ఏపీ నుంచి వెళ్లే యాత్రికులకు ఏపీ ప్రభుత్వం తరపున ఒకే ప్రాంగణంలో వసతి, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ తెలిపారు. కమిటీ సమావేశంలో సభ్యులైన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సయ్యద్ వలియుల్లా హుస్సేన్, çమహమ్మద్ ఇమ్రాన్, షేక్ గులాబ్జాన్, షేక్ అతువుల్హా తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేయండిలా.. హజ్ యాత్రకు వెళ్లే వారు http:hajcommittee.gov.in ద్వారా లేదా స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో మార్చి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు–2, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు–4, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ లేదా క్యాన్సిల్డ్ బ్యాంక్ చెక్ సమర్పించాలి ► ఉచితంగా దరఖాస్తు చేసేందుకు జిల్లా హజ్ సొసైటీల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ► దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు అవసరమైన పత్రాలు, అడ్వాన్స్ ఫీజు రసీదు, మెడికల్ సర్టిఫికెట్లను డ్రా తర్వాత ఏపీ హజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలి -
హైదరాబాద్ నుంచి హజ్ టికెట్ 65 వేలు
న్యూఢిల్లీ: హజ్ యాత్రికుల విమాన చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో టికెట్ ధర రూ.20 వేల నుంచి రూ.97 వేల వరకు తగ్గుతుందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వి అన్నారు. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో పోలిస్తే 18 నుంచి 49శాతం తక్కువని తెలిపారు. తాజా నిర్ణయంతో అహ్మదాబాద్, ఢిల్లీ నుంచి హజ్ యాత్రకు ప్రస్తుతం ఉన్న విమాన చార్జీ రూ.98, 750 నుంచి రూ.65,015కు, ముంబై నుంచి రూ.98,750 నుంచి రూ.57,857కు తగ్గుతుంది. శ్రీనగర్ నుంచి టికెట్ ధర ఇది వరకు రూ.1,98,350 ఉండగా అది గరిష్టంగా దాదాపు సగం తగ్గి రూ.1,01,400కే వస్తుంది. వారణాసి నుంచి ఉన్న రూ.1,12,300గా ఉన్న టికెట్ ధర కనిష్టంగా తగ్గి రూ.92,004 అవుతుంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఉన్న టికెట్ ధర రూ.1,01600 నుంచి రూ.65,766కు దిగిరానుంది. ఈ తగ్గింపు ఎయిరిండియా, సౌదీ ఎయిర్‌లైన్స్‌తోపాటు ఫ్లైనాస్ విమానాల్లో ప్రయాణించే వారికి వర్తించనుంది. సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైనాస్ సంస్థ మన దేశంలోని 21 విమానాశ్రయాల నుంచి జెడ్డా, మదీనాలకు సర్వీసులను నడుపుతోంది. 2012 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు హజ్ యాత్ర సబ్సిడీలను నెల క్రితం ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. -
‘హజ్’ తొక్కిసలాట మృతులు 769
22కి పెరిగిన భారతీయుల సంఖ్య మక్కా/మినా: హజ్ యాత్ర సందర్భంగా గురువారం మినాలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య శనివారానికి 22కి చేరింది. దీంతో ఈ సంఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి చేరుకుంది. మృతిచెందిన భారతీయులను గుర్తించడానికి సౌదీలోని భారత ఎంబసీ అక్కడి అధికారులతో కలసి పనిచేస్తున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 18 మంది మృతుల్లో 11 మంది గుజరాత్‌కు చెందినవారేనని చెప్పారు. తొక్కిసలాటలో మొత్తం 13 మంది భారతీయులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా హజ్‌యాత్రకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాలని సౌదీ రాజు అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించాలనీ ఆదేశించారు. యాత్రికులు అక్కడ ఉన్న అధికారుల సూచనలు పాటించకుండా ముందుకు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగి ఉండవచ్చని సౌదీ ఆరోగ్య మంత్రి ఫలీ పేర్కొన్నారు. -
హజ్ యాత్రలో విషాదం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లింలు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో ఈసారి నెల వ్యవధిలోనే రెండో విషాదం చోటు చేసుకుంది. పక్షం రోజుల క్రితం ఒక క్రేన్ కూలి 115మంది మరణించగా... గురువారం ఉదయం తొక్కిసలాట సంభవించి 700మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900మంది వరకూ గాయపడ్డారని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. 1990లో మక్కానుంచి మినాకు వెళ్లే దారిలో ఈ తరహాలోనే తొక్కిసలాట జరిగి 1,426 మంది కన్నుమూశారు. ఆ తర్వాత కనీసం నాలుగైదుసార్లు ఇలాగే తొక్కిస లాటలు చోటుచేసుకుని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2006లో మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో 364 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏవో చిన్న ఘటనలు మినహా అంతా సవ్యంగా గడిచింది. ఈసారి 20 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. మన దేశం నుంచి వెళ్లినవారి సంఖ్యే దాదాపు లక్షన్నర అని చెబుతున్నారు. మృతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన మహిళగా గుర్తించారు. జమారత్ స్థూపాల వద్దకు వెళ్లే మార్గాలను మూసేయడం వల్లనే లక్షలాదిమంది యాత్రికులు ఒకచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని ఇరాన్ హజ్ సంస్థ ముఖ్యుడు చెబుతున్నారు. అందుకు భిన్నంగా సైతాన్ను రాళ్లతో కొట్టే సందర్భంలో ఇలా జరిగిందని సౌదీ ప్రభుత్వం వివరణనిస్తోంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా పవిత్ర హజ్ ఆరాధనలో పాల్గొనాలని, దైవ ప్రసన్నం పొందాలని ముస్లింలంతా ఉవ్విళ్లూరుతారు. అందుకోసం ప్రత్యేకించి తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తుంటారు. మనస్సునూ, దేహాన్నీ నిర్మలంగా ఉంచుకుని అన్ని రకాల మనోవాంఛలకూ దూరంగా ఉంటూ నిరంతర దైవ ధ్యానంతో హజ్ యాత్రకు సిద్ధపడతారు. అలాంటి యాత్రలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. లక్షలాదిమంది ఒక చోటకు చేరే ఇలాంటి కార్యక్రమాలను నియంత్రించడం, అందరూ సురక్షితంగా తిరిగి వెళ్లేలా చూడటం సామాన్యమైన విషయం కాదు. ఇదంతా ఎన్నో ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది. హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లే చేసింది. లక్షమందికి పైగా పోలీసు సిబ్బందినీ, దాదాపు 30,000 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించింది. ఆపత్కాలంలో ఉపయోగించేందుకు వేలాది పడకలతో, అత్యవసర చికిత్సకు అవసరమైన పరికరాలతో ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అగ్నిమాపక దళాలను సిద్ధం చేసింది. 26 లక్షలమందికి సరిపడా గుడారాలను సమకూర్చింది. అవన్నీ అగ్ని ప్రమాదాలకు తావీయనివి. భక్తుల రద్దీ ఏటా పెరగడాన్ని గమనించి ఈసారి ప్రధాన మసీదు వద్ద 4,00,000 చదరపు మీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టింది. నిజానికి అందుకు సంబంధించిన నిర్మాణ పనులు సాగుతుండగానే పదిహేను రోజుల క్రితం క్రేన్ ఒక్కసారిగా కూలి వందమందికి పైగా మరణించారు. రద్దీని తగ్గించడం కోసం ఈసారి సౌదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. రిజిస్ట్రేషన్లు, పర్యాటక వీసాల్లో పెట్టిన నిబంధనలన్నీ తొలిసారి యాత్రకొచ్చేవారిని మాత్రమే అనుమతించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్థికంగా స్తోమత ఉండి, దైవ చింతనలో గడపాలనుకునేవారు జీవితంలో ఎన్నిసార్లయినా హజ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటారని, అటువంటివారికి సౌదీ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నదని విమర్శలు వచ్చాయి. అయితే ఏదో రకమైన పరిమితులు విధించకపోతే, అవసరమైన నియంత్రణా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి యాత్రల్లో అపశ్రుతులు దొర్లకుండా చూడటం సాధ్యం కాదన్నది సౌదీ అధికారులిస్తున్న సంజాయిషీ. ఆ వాదనలోని హేతుబద్ధత సంగతలా ఉంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సౌదీ ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న లోపాలను సరిగా పట్టించుకోలేదని, అందువల్లనే ఈ విషాదం చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా రెండు దారులు మూసేయడంవల్ల అటుగా వచ్చేవారికి తోవ లేకుండా పోయిందని చెబుతున్నారు. తొక్కిసలాటలు జరిగినప్పుడల్లా వినబడే కారణమే ఇది. మొన్న జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట సంభవించి 29మంది మరణించడానికి పుష్కర ఘాట్ వద్ద గేటు మూసి, భక్తుల్ని గంటల తరబడి నిలిపేసి ఒక్కసారిగా అనుమతించడమే కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా సాగించిన పూజ పూర్తయ్యేదాకా వారందరినీ కదలనీయలేదు. భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉండే ఇలాంటి సందర్భాలప్పుడు ప్రభుత్వాలు ప్రతి చిన్న అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రమాదాల నివారణ సాధ్యం కాదు. తొక్కిసలాటల విషయంలో ఒక అంతర్జాతీయ జర్నల్ ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. మన దేశంలో జరిగే తొక్కిసలాటల్లో 79 శాతం మతపరమైన కూడిక సందర్భంలోనే సంభవిస్తున్నాయని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇందుకు భిన్నంగా క్రీడలు జరిగే స్టేడియంలలో, సంగీత ఉత్సవాల్లో, నైట్ క్లబ్‌లలో చోటుచేసుకుంటాయి. వ్యక్తులుగా ఉన్నప్పటి ప్రవర్తనకూ, సమూహంలో భాగంగా ఉన్నప్పటి ప్రవర్తనకూ ఎంతో తేడా ఉంటుందని...చుట్టూ ఉన్నవారి ప్రవర్తనకు ప్రభావితమై ఎవరైనా అందులో భాగంగా మారిపోతారని, ఈ క్రమంలో తమను తాము మరిచిపోయే తత్వం ఏర్పడుతుందని సమూహ ప్రవర్తనను విశ్లేషించే నిపుణులు చెబుతారు. కనుక ఈ సందర్భాల్లో ఎంతో అప్రమత్తత అవసరమవుతుంది. హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. 1930లో ఆ యాత్రలో 30,000మంది పాల్గొన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అది ఇప్పుడు దాదాపు 30 లక్షలకు చేరువవుతున్నది. కనుక సౌదీ సర్కారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి సంభవించకుండా చూడాలి. ఒక్క సౌదీకే కాదు... ప్రపంచ దేశాలన్నిటికీ ఈ విషాద ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. -
ఇక ఆన్లైన్లో హజ్ దరఖాస్తులు
ఈ ఏడాది నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: ఇకపై హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే యాత్రకు సంబంధించిన ఖర్చులూ చెల్లించవచ్చు. భారతీయ హజ్ కమిటీ ఈ ఏడాది నుంచి ఆన్లైన్ సేవలను ప్రారంభించనుంది. హజ్ యాత్ర-2015కు వెళ్లే యాత్రికులు ఠీఠీఠీ.జ్చ్జిఛిౌఝఝజ్ట్ట్ఛ్ఛీ.ఛిౌఝ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో హజ్ రుసుము చెల్లించవచ్చు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ.షుకూర్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తులపై ప్రజల్లో అవగాహన లేనందున ఆఫ్‌లైన్ (లిఖితపూర్వకంగా) దరఖాస్తులు సైతం స్వీకరిస్తామన్నారు. ఫారాల పంపిణీని ఈ నెల 19 నుంచి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 20 లోగా తమ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మక్కాలో హజ్-2015 ప్రార్థనలు సెప్టెంబర్ 23న జరగవచ్చని, భారత్ నుంచి యాత్రికుల ప్రయాణాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కావచ్చని చెప్పారు. -
ప్రభుత్వ శిశు ప్రదానోత్సవం
‘‘సార్! మనమెటూ యిప్పుడు పెళ్లిళ్ల పేరున భారీ కానుకలు నవ వధువులకు సమర్పిస్తున్నాం. దానికి పొడిగింపుగా అయిదు రోజుల హనీమూన్ ప్యాకేజీని అందిస్తే మన పార్టీ, మన ప్రభుత్వం చిరస్మరణీయంగా జనహృదయాలలో పచ్చిగా పచ్చగా కలకాలం ఉంటాయ్ సార్. రైల్వే శాఖ, ఆర్టీసీ, పర్యాటక శాఖలు సహకరిస్తే హనీమూన్ దమ్మిడీ ఖర్చు లేకుండా ఆడుతూ పాడుతూ గడచిపోతుంది.’’ ముస్లిమ్ భక్తులు మక్కా మదీన దర్శించాలనుకుంటే హజ్ యాత్రకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ వస్తోం ది. స్తోమతు లేని వారు కూడా మక్కా యాత్ర చేసి వస్తుం టారు. క్రైస్తవ మిత్రులు జెరు సలెం వెళ్లడానికి మేము వెన్ను దన్నుగా ఉంటామని క్రిస్మస్ సందర్భంగా వాక్ కానుక ఇచ్చారు. అయితే మరి మా సంగతేమిటని హిందువుల మెదళ్లలో ప్రశ్నలు పుట్టాయి. మనది హిందూ దేశం, మన దేవుళ్లంతా స్థానికులు. అన్నీ యిక్కడిక్కడే కాబట్టి, విదేశీ మారకంతో పనిలేదు కాబట్టి, ఒక పొట్లం యాత్రని శ్రీసర్కార్ వారు సభక్తికంగా భరిస్తే తూకం సరిపోతుంది. హెచ్చుతగ్గులు లేక అంతా భాయి భాయి అనే నినాదంతో ముందుకు సాగుతాం. అప్పు డప్పుడు నన్నొక ధర్మ సందేహం దయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటుంది. మన దేశం సెక్యులర్ దేశం కదా. అంటే మతాతీత లౌకిక రాజ్యం కదా. అప్పుడు అందరూ అన్ని మత కేంద్రాలను దర్శించడం ధర్మం కదా అనిపిస్తూ ఉంటుంది. ఇక మళ్లీ హిందూ ప్యాకేజీ టూర్‌లోకి వస్తే అటు హరిద్వార్ నుంచి కన్యాకుమారి దాకా, అష్టదశ శక్తిపీఠాలను సేవించుకుంటూ, కాశీ విశ్వేశ్వరుణ్ణి అభి షేకించి, షిర్డీ సాయి కృపకి పాత్రులై, అయ్యప్ప శరణు కోరి, కలియుగ దైవంగా ఏడుకొండల మీద కొలువైన స్వామికి మొక్కి, పేరు లేకున్నా మహత్తులున్న యింకా కొందరు దేవుళ్లని కొలిచి అడంగుకి చేరేట్టుగా వుండాలి. అనాదిగా వస్తున్న హైందవ నమ్మకాలను గౌరవిస్తూ - వారి అస్థికల్ని త్రివేణి సంగమంలో శ్రద్ధగా కలుపుకో డానికి, నిమజ్జనం చేసుకోడానికి కూడా ప్రభుత్వం దన్నుగా నిలవాలి. వారి అస్థికలంటే వారివని కాదు. వారి యొక్క పెద్దలవని భావం. ఈ మధ్య మీడియా వక్రరేఖ మీద నడుస్తోంది. సరళరేఖ మీదికి రావాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సారు ఆలోచనకి సెకట్రీ నివ్వెరపోయాడు. అప్రయ త్నంగా వచ్చిన ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. తరువాత ప్రాధేయ పూర్వకంగా ఓ చూపు చూశాడు. ‘‘సరే, కానీ’’ అన్నట్టు చూశాడు అధినాయకుడు. ‘‘సార్! మనమెటూ యిప్పుడు పెళ్లిళ్ల పేరున భారీ కానుకలు నవ వధువులకు సమర్పిస్తున్నాం. దానికి పొడిగింపుగా అయిదు రోజుల హనీమూన్ ప్యాకేజీని అందిస్తే మన పార్టీ, మన ప్రభుత్వం చిరస్మరణీయంగా జనహృదయాలలో పచ్చిగా పచ్చగా కలకాలం ఉంటాయ్ సార్. రైల్వే శాఖ, ఆర్టీసీ, పర్యాటక శాఖలు సహకరిస్తే హనీమూన్ దమ్మిడీ ఖర్చు లేకుండా ఆడుతూ పాడుతూ గడచిపోతుంది. పగలూ రాత్రీ ఒక్క తీరున నడిచి పోతుంది’’. ‘‘సెకట్రీ! ఈ చలి దెబ్బకి నీ బుర్ర పాదరసంలా పరుగులు పెడుతోంది. ఇంకేమైనా వుంటే బయట పడెయ్. లోపలి చెత్తంతా వదిలి స్వచ్ఛ భారత్ అవు తుంది’’. సారు మాటలకి సెకట్రీ తెగ సిగ్గుపడ్డాడు. ‘‘పెళ్లి, ఆ తర్వాత హనీమూన్తో ముందుకు వెళ్లారు కదండీ. వెనక్కి తిరిగి వచ్చాక సంప్రదాయబద్ధంగా సీమంతం! ఇది ఆల్రెడీ మన ఎజెండాలో వున్నదే. కాబోయే తల్లులకు పాలు, గుడ్లు పౌష్టికాహారం అంది స్తూనే వున్నాం. వారు గుడ్డులో పచ్చసొన చూసినప్పుడల్లా మీరే కదండీ గుర్తొస్తారు. ఎటూ ఔషధ గుణాలున్నాయి కాబట్టి పాలల్లో కూడా చిటికెడు పసుపు కలిపితే వుభయ తారకంగా ఉంటుంది’’. అక్కడ ఆపి పాయింట్లోకి రమ్మని మందలించాడు. ‘‘అదే సార్, ఇంకా మనం సీమంతం చేసిన తల్లులు వున్నారు కదండీ, వాళ్లంతా పండంటి బిడ్డల్ని కంటారు. మనకి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తూ ఉంటుందండీ. దీనికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటాం. పిల్లల్ని ఎత్తుకుని ఆసుపత్రి నుంచి తల్లులు వెళ్లిపోకుండా దాన్నొక అధికారిక యీవెంట్గా, ఒక వేడుకగా జరుపుతాం. తల్లులందరూ తాము కన్న పిల్లల్ని ప్రేమాభిమానాలతో అందుకుం టారు. పది మంది మంత్రులు, పది మంది సామంతులు పచ్చ పూల పొత్తిళ్లలో పిల్లల్ని తల్లులకు హర్షధ్వానాల మధ్య అందిస్తారు. ‘ప్రభుత్వ శిశు ప్రదానోత్సవం’ పేరిట యిది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. పుట్టీపుట్టగానే బుల్లి తెరకెక్కినందుకు, తల్లులు ఆనందిస్తారు. ‘నాకేంటి మరి’ అని మీరనుకోవద్దు. కవలలు పుట్టినప్పుడు మీరే అందిస్తారు. తనివితీరా ప్రసంగిస్తారు. - (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత) శ్రీరమణ -
సెప్టెంబర్ 14న తొలి హజ్ ఫ్లైట్
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర తొలి ఫ్లైట్ సెప్టెంబర్ 14న ఉదయం 11.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఏ. షుకూర్ వెల్లడించారు. ఈ ఫ్లైట్ ద్వారా 350 మంది యాత్రికులను జెడ్డాకు పంపిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 6050 మందిని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో యాత్రికులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. -
హజ్ కరపత్రాలు విడుదల
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ఆస్తానే బుఖారియా పీఠంలో గురువారం హజ్ యాత్ర సూచనలు గల కరపత్రాలను పీఠాధిపతి ముస్తఫా హుసేని బుఖారి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన నగర ప్రముఖులు ఏఎస్ సాహెబ్‌జాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాల్లో పొందుపరిచామని వివరించారు. పీఠాదిపతి ముస్తఫా హుసేని బుఖారి మాట్లాడుతూ హజ్ యాత్రచేయడంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రార్థనా విధానాలు ఈ కరపత్రంలో ఉన్నాయని, వాటిని యాత్రికులు పాటించాలన్నారు. కరపత్రాలు ముస్లిం ఆర్ఫనైజ్లో ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునీర్ హుస్సేన్, రాయల్ రషీద్, హుసేని ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.