‘హజ్’ తొక్కిసలాట మృతులు 769 | Death toll to 769 in Hajj tour | Sakshi
Sakshi News home page

‘హజ్’ తొక్కిసలాట మృతులు 769

Published Sun, Sep 27 2015 4:07 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

Death toll to 769 in Hajj tour

22కి పెరిగిన భారతీయుల సంఖ్య
మక్కా/మినా: హజ్ యాత్ర సందర్భంగా గురువారం మినాలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య శనివారానికి  22కి చేరింది. దీంతో ఈ సంఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి చేరుకుంది.  మృతిచెందిన భారతీయులను గుర్తించడానికి సౌదీలోని భారత ఎంబసీ అక్కడి అధికారులతో కలసి పనిచేస్తున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 18 మంది మృతుల్లో 11 మంది గుజరాత్‌కు చెందినవారేనని చెప్పారు.
 
 తొక్కిసలాటలో మొత్తం 13 మంది భారతీయులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా హజ్‌యాత్రకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాలని సౌదీ రాజు అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించాలనీ ఆదేశించారు. యాత్రికులు అక్కడ ఉన్న అధికారుల సూచనలు పాటించకుండా ముందుకు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగి ఉండవచ్చని సౌదీ ఆరోగ్య మంత్రి ఫలీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement