9 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈసెట్-2016 నోటిఫికేషన్‌ను వచ్చే నెల 3న జారీ చేయనున్నారు. బుధవారం జరిగిన ఈసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఈసెట్ నోటిఫికేషన్, మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల విధానానికి సంబంధించి పూర్తి వివరాలను వచ్చే నెల 4న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, ఇతరులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు హైదరాబాద్‌లో రెండు, వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండలో ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ ఈసెట్ షెడ్యూల్...
2016 మార్చి 9 నుంచి: ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
2016 ఏప్రిల్ 12: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి గడువు
2016 ఏప్రిల్ 18: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్
2016 ఏప్రిల్ 21 నుంచి 2016 ఏప్రిల్ 25 వరకు: సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
2016 ఏప్రిల్ 25 వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్
2016 ఏప్రిల్ 27: పరీక్ష కేంద్రాల నిర్ణయం
2016 ఏప్రిల్ 30 వరకు: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్
2016 మే 5: హాల్ టికెట్ల జనరేషన్
2016 మే 5 వరకు: రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
2016 మే 6 నుంచి 2016 మే 10 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
2016 మే 12: ఈసెట్ పరీక్ష (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
2016 మే 23: ఫలితాల వెల్లడి
మార్చి 3న ఈసెట్ నోటిఫికేషన్
Published Thu, Feb 25 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement