చదువుకు సాయం
శ్రీకాకుళం: నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘భారతీ విద్యా పథకం’ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు ఏటా ఈ పథకం లో నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
అర్హతలు...
⇒ విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నివాసితులై ఉండాలి.
⇒ 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న వారు మాత్రమే అర్హులు.
⇒ దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లో చదువుతూ ఉండాలి.
⇒ తల్లితండ్రులు/సంరక్షకుని వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.
⇒ 2016-17 సంవత్సరంలో పాఠశాల/కళాశాల/ఇన్‌స్టిట్యూట్/ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి.
⇒ ముందు సంవత్సరంలోని చదువు లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉండాలి.
⇒ విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మాత్రం ఈ పథకానికి కూడా అర్హులే.
దరఖాస్తు చేసుకోండిలా..
⇒ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.and-h-ra-bra-h-m-in.ap.go-v.in వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 30లోపు పొందుపర్చాలి. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం : 1800 102 3579లో సంప్రదించవచ్చు.
⇒ దరఖాస్తుతోపాటు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
⇒ ఒక్కొక్కటీ 250 కేబీ లోపు పీడీఎఫ్ ఫార్మెట్‌లో ఉండాలి. ఏ కోర్సుకు దరఖాస్తుతోపాటు ఏయే ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలో ఏబీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
⇒ విద్యార్థి రాష్ట్రంలో చదివితే ఆంధ్రాబ్యాంకు ఖాతా, రాష్ట్రం వెలుపల చదివితే ఏ జాతీయ బ్యాంక్ ఖాతా అయినా తప్పనిసరిగా ఉండాలి.
⇒ ఎంపిక విధానంలో అనాథ, ఒంటరి తల్లి, శారీరక వైకల్యం, బాలిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్రమం పాటిస్తారు. నిర్ణీత మొత్తాన్ని ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థుల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు.