Andhra Pradesh Brahman Welfare Corporation
-
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణు ప్రమాణం
-
బాధ్యతలు స్వీకరించిన మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎంతో మేలు చేయాలని తనకు ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. ఉపనయనం చేసే కార్యక్రమాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే చేయాలనే ఆలోచన ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో త్వరలో చేపడతామని అన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. పేద బ్రాహ్మణలు, విద్యార్థులకు విజయవాడ, తిరుపతిలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు పేర్కొన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ..నిత్యం ప్రజల కోసం విష్ణు పరితపిస్తుంటారని అన్నారు. ప్రతిష్టాత్మకమైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు వరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అర్హులైన నిరుపేద బ్రాహ్మణులందరికి సహాయం చేసే అవకాశం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు మల్లాది విష్ణుకు వరించాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణులు అభివృద్దికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జ్వాలపురం శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గుతున్నప్పటికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ కొనియాడారు. ప్రభుత్వానికి, బ్రాహ్మణ పేదలకు వారధిగా పనిచేసే అవకాశం విష్ణుకు దక్కిందని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అమలయ్యేలా కృషి చేస్తారని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో సీఎం జగన్ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మంత్రి బొత్స తెలిపారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరు కాగా, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే జోగి రమేష్, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు అమర్, ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల తదితరులు విచ్చేశారు. -
చదువుకు సాయం
శ్రీకాకుళం: నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘భారతీ విద్యా పథకం’ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు ఏటా ఈ పథకం లో నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అర్హతలు... ⇒ విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నివాసితులై ఉండాలి. ⇒ 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న వారు మాత్రమే అర్హులు. ⇒ దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లో చదువుతూ ఉండాలి. ⇒ తల్లితండ్రులు/సంరక్షకుని వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. ⇒ 2016-17 సంవత్సరంలో పాఠశాల/కళాశాల/ఇన్స్టిట్యూట్/ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి. ⇒ ముందు సంవత్సరంలోని చదువు లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉండాలి. ⇒ విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మాత్రం ఈ పథకానికి కూడా అర్హులే. దరఖాస్తు చేసుకోండిలా.. ⇒ దరఖాస్తులను ఆన్లైన్లో www.and-h-ra-bra-h-m-in.ap.go-v.in వెబ్సైట్లో సెప్టెంబర్ 30లోపు పొందుపర్చాలి. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం : 1800 102 3579లో సంప్రదించవచ్చు. ⇒ దరఖాస్తుతోపాటు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు ⇒ ఒక్కొక్కటీ 250 కేబీ లోపు పీడీఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. ఏ కోర్సుకు దరఖాస్తుతోపాటు ఏయే ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలో ఏబీసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ⇒ విద్యార్థి రాష్ట్రంలో చదివితే ఆంధ్రాబ్యాంకు ఖాతా, రాష్ట్రం వెలుపల చదివితే ఏ జాతీయ బ్యాంక్ ఖాతా అయినా తప్పనిసరిగా ఉండాలి. ⇒ ఎంపిక విధానంలో అనాథ, ఒంటరి తల్లి, శారీరక వైకల్యం, బాలిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్రమం పాటిస్తారు. నిర్ణీత మొత్తాన్ని ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థుల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు.