పోటెత్తారు...
ఆదివారం ఒక్కరోజు జిల్లాలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు 43,738 మంది. మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలు మినహా మిగతా పది సెగ్మెంట్లలో నమోదైన సంఖ్య ఇది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 16,032 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.
ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 2,990 పోలింగ్ బూత్‌ల పరిధిలో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌కు విశేష స్పందన లభించింది
. అయితే ఇదివరకు ఉన్న పేర్లు గల్లంతు కావడం... తప్పులుండడం... ఇంట్లో ఒకరి పేరు ఉండి మరొకరిది లేకపోవడం వంటి తప్పిదాలు షరామామూలుగా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం ఉన్న పేరును సమాచారం లేకుండా తొలగించడమేంటని బీఎల్‌ఓలు, వీఆర్‌ఓలతో పలువురు వాగ్వాదానికి దిగారు. ఆరు నెలల క్రితం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా... జాబితాలో పేరెందుకు లేదంటూ అధికారులను తప్పుబట్టారు. ఓటరు నమోదు కేంద్రాల వద్ద జీరాక్స్ కేంద్రాలు లేకపోవడంతో దరఖాస్తుదారులు నానాఅవస్తలు ఎదుర్కొన్నారు.
సమయానికి రాని బీఎల్‌ఓలు
బూత్ స్థాయి అధికారులు ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటారని కలెక్టర్ ప్రకటించడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటరు నమోదు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కుమార్‌పల్లిలోని తోటబడి, మార్కెట్ స్కూల్, సుబేదారిలోని రెడ్‌క్రాస్, ఆర్ట్స్ కాలేజీ, జూలైవాడతోపాటు పలు ప్రాంతాల్లో 11 గంటల వరకు బీఎల్‌ఓలు రాకపోవడంతో దరఖాస్తుదారులు పడిగాపులు కాయూల్సి వచ్చింది. విసిగిన ప్రజలు ఒక్కొక్కరుగా హన్మకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ రద్దీ ఎక్కువైంది. సిబ్బంది తక్కువగా ఉండడంతో వచ్చినవారికి సమాధానం చెప్పేవారే కరువయ్యూరు.
పనిచేయని ఆన్‌లైన్ సేవలు
నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికీ ఇబ్బందులు తప్పలేదు. ఉదయంన ుంచి వెబ్‌సైట్ సేవలు అందలేదు. దీంతో అందరూ బూత్‌లకే వచ్చారు. ఇంటర్నెట్‌లో గతంలో దరఖాస్తు చేసిన వారిలో చాలా మంది పేర్లు జాబితాలో లేవు. దీంతో వారు గతంలో తీసుకున్న ప్రింట్‌తో వచ్చి అధికారులను నిలదీశారు. కాగా,
ఇంకా... సమాచారం అందలేదు
ల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదుకు సంబంధించి రాత్రి 10.30 గంటల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ విశ్వనారాయణ తెలిపారు. వివరాలు సోమవారం వెల్లడిస్తామన్నారు.