సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలను హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని వివరించారు. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.
చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే డబ్బు ఇస్తాం.. వృద్ధురాలిపై అమానుషం
నేటి ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు ఎవరూ నామినేషన్లు వేసేటట్టు కనిపించడం లేదు. మంచి రోజు చూసుకుని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చేటట్టు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
చదవండి: పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా
Comments
Please login to add a commentAdd a comment