ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు 28 నుంచి 31వరకు వెబ్ ఆప్షన్లను tsicet.nic.in వెబ్‌సైటల్లో ఇచ్చుకోవచ్చన్నారు. విద్యార్థులకు వచ్చే నెల 2న సాయంత్రం 6 గంటలకు సీట్లు కేటాయిస్తామని వివరించారు.
ఇదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు..
⇒ 27న 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు
⇒ 28న 15,001 నుంచి 30 వేల ర్యాంకు వరకు
⇒ 29న 30,001 నుంచి 45 వేల ర్యాంకు వరకు
⇒ 30న 45,001 నుంచి చివరి ర్యాంకు వరకు.