టీఎస్‌ జెన్‌కో నోటిఫికేషన్‌ జారీ | TSgenco notification issued | Sakshi
Sakshi News home page

టీఎస్‌ జెన్‌కో నోటిఫికేషన్‌ జారీ

Published Sat, Apr 14 2018 12:52 AM | Last Updated on Sat, Apr 14 2018 12:52 AM

TSgenco notification issued - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) 33 ఖాళీలు, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ) 42 ఖాళీల భర్తీకి టీఎస్‌జెన్‌కో శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) పోస్టులకు ఎంబీఏ(హెచ్‌ఆర్‌)/ఎంఎస్‌డబ్ల్యూ/పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/హ్యూమన్‌ రైట్స్‌/లా కోర్సులో 2 సంవత్సరాల డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండి, 8సంవత్సరాల అనుభవం ఉండాలి.

జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ నుంచి ఎంకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/బీకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు కేటగిరీలకు ఏప్రిల్‌ 13 నుంచి ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఫీజు చెల్లింపునకు మే 9 చివరితేది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది మే 10. హాల్‌టికెట్‌ను మే 20వతేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష నిర్వహించనున్నారు. వివరాలకు వెబ్‌సైట్‌  www.tsgenco.co.in  లో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement