AE Posts
-
త్వరలో జెన్కోలో 350 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) త్వరలో దాదాపు 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభా గాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి -
గుడ్‌న్యూస్! టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తులను స్వీకరించ నుంది. ఆగస్టు 6 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అం డ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయసు గల అభ్య ర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీ రక వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వర్తించనుంది. కొత్త జోన ల్ విధానం కింద టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధి లోని 18 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం పోస్టు లు రిజర్వ్ చేశారు. మిగిలిన 5 శాతం పోస్టుల ను ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. సంస్థ వెబ్సైట్ జ్టి్టp://్టటnpఛీఛి .ఛిజజ.జౌఠి.జీn ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖ (TSSPDCL)లో పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరింది. ఈనెల 12వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, రాత పరీక్ష జూలై 17వ తేదీన జరుగనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఖాళీ ఏఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. సోమ వారం విద్యుత్‌సౌధలో టీఎస్ఈఏఈఏ డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి సంస్థలను దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
త్వరలో 4,000 ‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్, 174 సబ్ ఇంజనీర్.. 1,100 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరగనున్న విద్యుత్ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేశాయి. రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి. -
‘ఉమ్మడి’గా విద్యుత్ ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుమారు 600 మేర అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ కానుంది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకుముందు విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ కోసం ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకట నలు జారీ చేయడం పలు సమస్యలకు దారి తీసింది. దాంతో ఉమ్మడి నియామక ప్రకటనల ద్వారా ఏఈ పోస్టుల భర్తీ చేపట్టాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయిం చాయి. తమ పరిధిలోని ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఏఈ మిగులు పోస్టుల భర్తీ పూర్తి రాష్ట్ర విద్యుత్ సంస్థలు రెండేళ్ల కింద 1,427 ఏఈ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ల కింద నియామకాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. తెలంగాణ జెన్కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్లో 164, ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులు కలిపి మొత్తం 1,427 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా విద్యుత్ సంస్థలు ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకటనలు జారీ చేశాయి. అయితే కొందరు అభ్యర్థులు రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాంటివారు ఏదో ఒక సంస్థలో చేరగా.. మిగతా సంస్థల్లో వారికి సంబంధించిన పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. టీఎస్ఎన్పీడీసీఎల్లో నియామకాలు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఇతర సంస్థల్లో చేరిపోయారు. దాంతో ఇందులోని 164 ఏఈ పోస్టులకుగాను ఏకంగా 107 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ట్రాన్స్‌కోలో 206 పోస్టులకుగాను 59, టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులకుగాను 73 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వివాదాలకు దారితీసింది. దాంతో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక మినహాయింపు పొంది ఈ 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాల్సి వచ్చింది. ఇందులోనూ కొందరు ఉద్యోగంలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో మూడో మెరిట్ జాబితాను ప్రకటించారు. ఎట్టకేలకు రెండో, మూడో మెరిట్ జాబితాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ట్రాన్స్‌కో గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. -
1,000 విద్యుత్ ఏఈ పోస్టులు
భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో దాదాపు 1,000 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో నిరం తర విద్యుత్, వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ సరఫరాను పక్కాగా అమ లు చేసేందుకు కృషి చేస్తున్న విద్యుత్ ఉద్యో గులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పిస్తా మని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు నెలలు కిందే 13,500 కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఆ పోస్టుల్లోకి ఇటీవల పదోన్నతులు కల్పించడంతో కింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), ఉత్తర తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లలోని వివిధ విభాగాల్లో దాదాపు 1,000 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా సంస్థల యాజమాన్యాలు గుర్తించాయి. వీటిని భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించాయి. వీటితోపాటు నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నాయి. మొత్తంగా పోస్టుల భర్తీపై కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వారంలో ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. స్థానికత, పుట్టిన తేదీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో 22 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలు గుర్తించాయి. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకునే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే న్యాయస్థానాల తీర్పులకు లోబడే క్రమబద్ధీకరణ జరుపుతామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఏఈ పరీక్షలకు 63.66 శాతం హాజరు
విజయవాడ: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. విజయవాడలో 19 కేంద్రాల్లో ఈ పరీక్షలకు 63.66శాతం మంది హాజరయ్యారు. విజయవాడ నుంచి 8,787మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 5,594మంది అభ్యర్ధులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ బాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తుగా 144వ సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు. -
ఏఈలు కావలెను!
కార్పొరేషన్లో 16 మంది ఏఈలకు గాను ఉండేది ఆరుగురే ఇంజనీరింగ్ విభాగంలో నిలిచిపోయిన సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక నిధుల ప్రతిపాదనలు మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరేనా? నెల్లూరు, సిటీ : రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ సొంత జిల్లా అయిన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ) కొరత తీవ్రంగా ఉంది. 16 మంది ఏఈలకు గాను కేవలం 6 మంది మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. ఇటీవల ఆరుగురు తాత్కాలిక జూనియర్ ఏఈలు పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లారు. దీంతో నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14 ఆర్థిక సంఘం నిధులతో టెండర్లకు ప్రతిపాదనల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాక ఇప్పటికే టెండర్లు పిలిచి, జరుగుతున్న పనుల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఏఈల కొరత నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 54 డివిజన్లకు గాను కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ముజాహిద్దీన్, పద్మజ, నాగేంద్రకుమార్, మూర్తి, సుదేష్ణ, రాజు ఉన్నారు. గత నెల వరకు జూనియర్ తాత్కాలిక ఏఈలు ఆరుగురి సహకారం ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వారి సహకారం ఉండడంతో కొంతవరకు నిర్మాణం చేయగలిగారు. ఇటీవల పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లిన తాత్కాలిక ఏఈలు ఆరుగురు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఈలపైనే అధిక పని భారం పడుతోంది. ప్రస్తుతం ఉన్న ఏఈల్లో కూడా ఒకరు అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. కేవలం 5 మంది విధుల్లో ఉన్నారు. అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఇంజనీరింగ్ విభాగంలో ఏఈల కొరత కారణంగా అధికార పార్టీ నాయకులకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు ఆలస్యమవడంతో అధికారులపై మేయర్ వర్గం, అధికార పార్టీ నాయకులు తమ బిల్లులు మంజూరు చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇతర కాంట్రాక్ట్ర్ల పనులకు సంబంధించి ఫైళ్లను పక్కన పెట్టి కేవలం మేయర్ వర్గం చెప్పిన వారి పనులు చేయడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతోంది. చోద్యం చూస్తున్న మేయర్, కమిషనర్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈల కొరతతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంటే మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఈ నెల 15వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో టెండర్లు పిలవకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అన్ని ప్రతిపక్ష పార్టీలు మేయర్, కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అవసరమైన మేర ఏఈల నియామకం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.