సాక్షి, హైదరాబాద్: నిర్వహణ,మరమ్మతు పనులకు సంబంధించిన ప్రామాణిక ధరల పట్టిక(ఎస్‌ఎస్‌ఆర్) రేట్లను పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 25% పెం చుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కృషి తో ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెరిగాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆయన కు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ మేరకు పెద్ద సం ఖ్యలో విద్యుత్ కాంట్రాక్టర్లు శనివారం మంత్రి నివాసానికి చేరుకుని ఆయన్ను సన్మానించారు. ఐదేళ్ల నుంచి రేట్ల పెంపుదల కోసం నిరీక్షిస్తున్నామని, సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ఎస్‌కే మాజిద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment