SSR
-
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్‌ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,99,74,919
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 2,99,74,919 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చోటు పొందిన యువ ఓటర్లు 2,78,650 మంది ఉండటం విశేషం. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్)–2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. సాధారణ ఓటర్లకు ఎన్ఆర్ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు (కేంద్ర సాయుధ బలగాలు) 15,282 మంది కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన శాసనసభ ఎన్నికలను ఈ జాబితాతోనే నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమం కావడంతో ఎన్నికల ప్రకటన నాటికి జాబితాలో స్థానం పొందే కొత్త ఓటర్లకు సైతం ఓటు హక్కును కల్పించనున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో... వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా గతేడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన 2023 వార్షిక ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. గతేడాది తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత నిరంతర నవీకరణ చేపట్టారు. ఒకే తరహా ఫొటోలు కలిగిన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి తొలగించారు. మొత్తం 11,36,873 ఓటర్లను తొలగించగా, కొత్తగా 3,45,648 ఓటర్లను చేర్చారు. దీంతో ఓటర్ల జాబితా సవరణ 2023లో భాగంగా గత నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,65,669కు తగ్గింది. ఆ తర్వాత కొత్తగా 6,84,408 మందికి చోటు కల్పించగా, 2,72,418 మంది ఓటర్లను తొలగించారు. దీంతో తాజాగా ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో సాధారణ ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో... మారుమూల గిరిజన ప్రాంతంలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది 2,800 మంది గిరిజనులు తొలిసారిగా ఓటు హక్కును పొందారు. 361 గిరిజన ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించి కొలామ్స్, తోటి, చెంచులు, కండారెడ్డి తెగల గిరిజనులకు ఓటు హక్కు కల్పించారు. సదరం డేటాబేస్, ఆసరా పెన్షన్ల సమాచారాన్ని వికలాంగ ఓటర్ల నమోదుకు వినియోగించారు. ముందస్తుగా ఓటర్ల నమోదులో భాగంగా 17 ఏళ్లు నిండిన 20,246 మంది యువతీయువకుల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించారు. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు. ఇంకా నమోదు చేసుకోవచ్చు: సీఈఓ వికాస్ రాజ్ ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమమని, తుది జాబితాలో చోటుపొందని వారు మళ్లీ దరఖాస్తు చే సుకోవచ్చు. ఎన్వీఎస్పీ వెబ్‌పోర్టల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా తమ దరఖాస్తును స్థానిక బీఎల్ఓకు అందజేస్తే అర్హులకు ఓటు హక్కు కల్పిస్తాం. -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచిన దక్షిణ డిస్కం
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ,మరమ్మతు పనులకు సంబంధించిన ప్రామాణిక ధరల పట్టిక(ఎస్ఎస్ఆర్) రేట్లను పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 25% పెం చుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కృషి తో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆయన కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పెద్ద సం ఖ్యలో విద్యుత్ కాంట్రాక్టర్లు శనివారం మంత్రి నివాసానికి చేరుకుని ఆయన్ను సన్మానించారు. ఐదేళ్ల నుంచి రేట్ల పెంపుదల కోసం నిరీక్షిస్తున్నామని, సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ఎస్కే మాజిద్ తెలిపారు. -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో పనులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర డిస్కంతో సమానంగా దక్షిణ డిస్కంలో కాంట్రాక్ట్ పనుల ధరలను సవరించాలని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు. పనుల అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్ఐ, సెస్, కాంట్రాక్టర్ల అలవెన్సులను కలపాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, సంయుక్త కార్యదర్శి సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ గుణపాఠం
తమిళసినిమా: ఫేస్బుక్ ఉపయోగించే అమ్మాయిలందరికీ ఒక పాఠంగా ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు రాహుల్ అంటున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోనూ మంచి అనుభవం గడించిన ఆర్పీఎం సినిమాస్ అధినేత రాహుల్ ఇంతకుముందు ‘జిత్తన్ 2’, ‘1ఏఎం’ వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించడంతో పాటు ‘కళత్తూర్ గ్రామం’, ‘143’ చిత్రాలను విడుదల చేశారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం ‘కరుత్తుగళ్ పదివు చెయ్’. ఈ చిత్రం ద్వారా దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్ఎస్ఆర్ మనుమడు ఎస్ఎస్ఆర్.ఆరియన్ హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్గా ఉపాసనరాయ్ నటిస్తోంది. మిర్చి శివ హీరోగా నటించిన ‘యా యా’ చిత్ర దర్శకుడు రాజశేఖర్ ఈ సినిమాకు కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించి నిర్మించిన ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని దర్శక నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. దీనికి మనోహర్ ఛాయాగ్రహణం, గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. -
వాటర్‌గ్రిడ్‌కు ఆదిలోనే ఆటంకం
* టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన * కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌తో మళ్లీ అంచనాలు * మారనున్న తొలి టెండర్ షెడ్యూలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాట ర్ ప్రాజెక్ట్(వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు ఆది లోనే ఆటంకం ఏర్పడింది. సుమారు రూ. 35 వేల కోట్ల విలువైన పనుల టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. 2015-16 సంవత్సరానికి నూతన షెడ్యూల్ స్టాండర్డ్ రేట్ల(ఎస్ఎస్ఆర్)ను ప్రభుత్వం విడుదల చేయడమే ఈ ప్రతిష్టంభనకు కారణమైంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం గత నెల 23న గ్రామీణ నీటి సరఫరా అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ టెండరు(పనుల) వివరాలను జూలై 27న వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి గత నెల 25న కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లను విడుదల చేశారు. దీంతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ప్యాకేజీల అంచనాలు మారనున్నాయి. ప్రాజెక్ట్ వ్యయం కూడా మరో 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటేక్ వెల్స్‌తో కలిపి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ వ్యయం రూ.40 వేల కోట్లు దాటనుంది. దీని నిర్మాణాన్ని మొత్తం 26 ప్యాకేజీలుగా విభజించిన అధికారులు తొలి విడతగా 11 ప్యాకేజీలకు టెం డర్లను పిలిచారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 34,568 కోట్లు గా నిర్ధారించిన అధికారులు తొలుత రూ.15, 987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగష్టు 11న టెక్నికల్ బిడ్లను, 14న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నట్లు ప్రకటిం చారు. ఈ నెల 14తో తొలివిడత టెండర్ ప్రక్రి య పూర్తి కావాల్సి ఉండగా, తాజా పరిణామాలతో గడువును పొడిగించే అవకాశం ఉంది.