* టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన
* కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌తో మళ్లీ అంచనాలు
* మారనున్న తొలి టెండర్ షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాట ర్ ప్రాజెక్ట్(వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు ఆది లోనే ఆటంకం ఏర్పడింది. సుమారు రూ. 35 వేల కోట్ల విలువైన పనుల టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. 2015-16 సంవత్సరానికి నూతన షెడ్యూల్ స్టాండర్డ్ రేట్ల(ఎస్‌ఎస్‌ఆర్)ను ప్రభుత్వం విడుదల చేయడమే ఈ ప్రతిష్టంభనకు కారణమైంది.
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం గత నెల 23న గ్రామీణ నీటి సరఫరా అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ టెండరు(పనుల) వివరాలను జూలై 27న వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి గత నెల 25న కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను విడుదల చేశారు. దీంతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ప్యాకేజీల అంచనాలు మారనున్నాయి. ప్రాజెక్ట్ వ్యయం కూడా మరో 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇంటేక్ వెల్స్‌తో కలిపి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ వ్యయం రూ.40 వేల కోట్లు దాటనుంది. దీని నిర్మాణాన్ని మొత్తం 26 ప్యాకేజీలుగా విభజించిన అధికారులు తొలి విడతగా 11 ప్యాకేజీలకు టెం డర్లను పిలిచారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 34,568 కోట్లు గా నిర్ధారించిన అధికారులు తొలుత రూ.15, 987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగష్టు 11న టెక్నికల్ బిడ్‌లను, 14న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నట్లు ప్రకటిం చారు. ఈ నెల 14తో తొలివిడత టెండర్ ప్రక్రి య పూర్తి కావాల్సి ఉండగా, తాజా పరిణామాలతో గడువును పొడిగించే అవకాశం ఉంది.
వాటర్‌గ్రిడ్‌కు ఆదిలోనే ఆటంకం
Published Tue, Aug 4 2015 1:26 AM | Last Updated on Sat, Aug 11 2018 6:34 PM
Advertisement
Advertisement